
మన దేశంలో జ్యోతిష్యానికి క్రేజ్ తగ్గలేదు. పెళ్లిళ్లయినా, బిజినెస్ అయినా జాతకాలు, ముహూర్తాలు చూడటం అలవాటే. ఇదంతా పెద్దోళ్లు.. పాత తరం వాళ్లు అనుకుంటే పొరపాటే. నేటి తరం.. జెన్ జీ.. Gen Z & Millennials చాలా ఎక్కువగా జ్యోతిష్యాన్ని ఫాలో అవుతున్నారంట.. అవును.. ఈ తరం వాళ్లు ఏంటీ జ్యోతిష్యం, ముహూర్తాలు చూడటం ఏంటీ అనుకుంటున్నారా.. ఇది పచ్చి నిజం. కాకపోతే దీన్ని అత్యంత రహస్యంగా ఫాలో అవుతున్నారంట. నలుగురులో దేవుడు లేడు.. దెయ్యం లేదు అంటూనే.. ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదైనా ముఖ్యమైన పనిపై బయటకు వెళుతున్నప్పుడు.. మంచి పని ప్రారంభించేటప్పుడు ముహూర్తాలు, జ్యోతిష్యం చూస్తున్నారంట.. కాకపోతే వీళ్లు పంతుళ్లు దగ్గరకు.. జ్యోతిష్యుల దగ్గరకు వెళ్లటం లేదంట. అంతా ఆన్ లైన్.. ఆన్ లైన్ లో ఆస్ట్రాలజీ యాప్స్ ఫాలో అవుతున్నారంట. ఇంకా కెరీర్, లవ్, ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. విచిత్రం ఏంటంటే.. ఈ యాప్స్ వాడుతున్నామనే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతున్నారు. ఫ్రెండ్స్ కు సైతం చెప్పటం లేదంట.
జ్యోతిష్యం యాప్స్ వాడుతున్నారు.. బయటికి చెప్పటం లేదు :
జ్యోతిష్యం యాప్స్ ఉపయోగించే యువకులు ఈ విషయాన్ని బయటకు చెప్పుకోవటానికి సిగ్గు పడుతున్నారంట. జ్యోతిష్యంపై నమ్మకాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారంట. ఆస్ట్రో యాప్స్ వాడుతున్నాం అనే విషయాన్ని ఇంట్లో వాళ్ల దగ్గర కూడా చెప్పటం లేదంట జెన్ జీ కుర్రోళ్లు. పాత తరం వాళ్ల కంటే ఇప్పటి జెన్ జీ కుర్రోళ్లే ఆన్ లైన్ లో ఎక్కువగా ఆస్ట్రాలజీ యాప్స్ ఫాలో అవుతున్నారంట. అయితే అది సీక్రెట్ గా..
జ్యోతిష్యంలో ఆసక్తి ఉంది కానీ.. గుడ్డిగా నమ్మలేం :
జ్యోతిష్యం గురించి తెలుసుకుంటాం.. గ్రహాల మార్పు.. వాటి ప్రభావాన్ని ఫాలో అవుతాం.. కాకపోతే గుడ్డిగా నమ్మం. గుడ్డిగా నమ్మి పూజలు, యాగాలు చేయం అంటున్నారంట జెన్ జీ కుర్రోళ్లు. జ్యోతిష్యంలో చెప్పే విషయాలు కొంత వరకు మాత్రమే కనెక్ట్ అవుతున్నాయని.. అంతా వాళ్లు చెప్పినట్లే జరగటం లేదని.. కొన్ని విషయాలు కరెక్ట్ గా అనిపిస్తున్నా.. గుడ్డిగా ఎలా నమ్ముతాం అంతా క్లారిటీగా ఉన్నారంట ఈ తరం యువత. కొందరు జ్యోతిష్యులు చెప్పే ప్రిడిక్షన్స్ ఆశ్చర్యంగా అనిపిస్తాయని.. మరీ ఓవర్ గా ఉంటున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారంట. జ్యోతిష్యాన్ని ఓ గైడ్ చూస్తున్నారంట.. పూర్తిగా జ్యోతిష్యాన్ని నమ్ముకుని కూర్చోకుండా ప్రాక్టికల్ మైండ్‌సెట్‌తో ముందుకు వెళుతున్నారంట నేటి తరం కుర్రోళ్లు..
కెరీర్ టెన్షన్.. ఒత్తిడి :
ఇక కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు.. సోషల్ మీడియాలో యాడ్స్ చూసి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని.. రేపు ప్రభుత్వ ఉద్యోగం వస్తుందో లేదో అనే భయాలు.. జీవితంలో సెటిల్ అవుతాము లేదా వంటి వాటిపై లేదా క్లారిటీ కోసం మాత్రమే యాప్స్ వాడుతున్నారట. అయితే, రియాలిటీకి సరిపోయేలా కచ్చితంగా చెప్పే జ్యోతిష్యులు దొరకడం కష్టమేనని… ఎవరైనా అడిగితే కూడా ఈ యాప్ వాడుతున్నానని కూడా అస్సలు ఒప్పుకోము అని చెప్పేస్తున్నారట.
సరదాగా ట్రై చేస్తున్నా:
సాధారణంగా ప్లేస్టోర్‌లో కనిపించే యాప్స్ చూసి సరదాగా ట్రై చేస్తున్నారు కొందరు Gen Z. వీళ్ళు పర్సనాలిటీ, కెరీర్ గురించి యాప్ ఏం చెబుతుందోనని కుతూహలం, ఆతృతతో వాడుతున్నారట. కానీ ఏ యాప్ కూడా వాళ్ళ ఫ్యూచర్ 100% చెప్పలేదని వారికీ అర్థమైందట. మన సక్సెస్ అనేది నక్షత్రాల మీద కాదు, మనం పడే కష్టం మీదే ఆధారపడి ఉంటుందని… అందుకే ఇలాంటి యాప్స్ వాడమని ఇతరులకి కూడా రికమండ్ చేయము అంటున్నారట.
డబ్బులు గుంజే ప్లాన్.. :
వ్యక్తిగత జ్యోతిష్యుల కంటే ఆన్‌లైన్ జ్యోతిష్యమే బెటర్ అని ట్రై చేసిన కొందరికి… వాళ్ళు చెప్పే విషయాలన్నీ చాలా కామన్‌గా, ఎవరికైనా వర్తించేలా ఉంటాయని.. వాళ్ళు చెప్పే వాటిలో కొన్ని విషయాలైన మనకు కనెక్ట్ అయ్యేలా అనిపిస్తాయని…. ఇది జ్యోతిష్యం కాదు, కేవలం హ్యూమన్ సైకాలజీతో ఆడుకోవడం. మనం మళ్లీ మళ్లీ కనెక్ట్ అయ్యి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేలా మాటలు మారుస్తారని… ఇవన్నీ రియాలిటీ ప్రపంచంలో వేస్ట్ అని భావిస్తున్నారట.
యాప్‌లో డబ్బులు పెట్టి మరి :
విపరీతమైన ఒత్తిడి, ఒంటరితనం సమయంలో వాళ్ళ జీవితంలోకి తోడుగా ఎవరొస్తారు, ఎప్పుడు వస్తారు అని తెలుసుకోవడానికి కూడా జ్యోతిష్య యాప్‌లో డబ్బులు పెట్టి తెలుసుకుంటున్నారట. హాస్యంగా అనిపించినా… కానీ.. ఆ సమయంలో మానసికంగా ఏదో ఒక భరోసా కావాలనిపించి… అందుకే ఇలా చేస్తున్నారట వీళ్లు.
ముందే తెలిస్తే.. రెడీగా ఉండొచ్చని :
వీరి అభిప్రాయం ప్రకారం.. జ్యోతిష్యం అనేది సమస్యలను పరిష్కరించదట, కానీ రాబోయే కాలం ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తే… ముందు ముందు రాబోయే కష్టాల గురించి ఒక ఐడియా ఉంటే, మానసికంగా రెడీగా ఉండొచ్చు కదా అనేది వీళ్ళ లాజిక్. చివరికి జెన్ జీ.. యువత జ్యోతిష్య యాప్‌లను గుడ్డిగా నమ్మడం లేదు. కానీ, జీవితంలో ఒత్తిడి, కెరీర్ భయాలు, ఒంటరితనం ఎదురైనప్పుడు.. వారికి తాత్కాలిక భరోసాను, ఒక చిన్న ఆశను ఇచ్చే ఎమోషనల్ సపోర్ట్ సిస్టమ్ లాగా ఈ యాప్స్ ఉపయోగపడుతున్నాయి.