Reading Time: 2 minutes
Pawan Kalyan Appoints Observers For 25 Parliament Constituencies To Strengthen Jana Sena Party

Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పదవుల కోసం దరఖాస్తుల స్వీకరణ, నాయకుల అభిప్రాయాల సేకరణ కోసం 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సమాచార సేకరణ కమిటీ పరిశీలకులను నియమించారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు, జనసైనికులు, వీర మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈ కమిటీలు పనిచేయనున్నాయి. పార్టీలో ఏ స్థాయి బాధ్యతలు చేపట్టాలనుకుంటున్నారో దరఖాస్తుదారుల అభిప్రాయాలను కూడా సేకరించనున్నాయి.

ప్రతి పరిశీలకుడికి ముగ్గురు సీనియర్ నాయకులు, ముగ్గురు సాధకులు, 21 మంది సమన్వయకర్తలు సహకరించనున్నారు. సేకరించిన దరఖాస్తులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించనుండగా, వాటిని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ స్వయంగా పరిశీలించనున్నారు. తుది నిర్ణయం పార్టీ అధ్యక్షుడిదేనని జనసేన స్పష్టం చేసింది. ఈ నెల 29వ తేదీ నుంచి సమాచార సేకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నారు. పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సీనియర్ నేతలను పరిశీలకులుగా నియమించారు. వీరు స్థానిక స్థాయిలో పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించి కేంద్ర నాయకత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ నియామకాలతో పార్టీ క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం అవుతుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి.

సమాచార సేకరణ కమిటీ పరిశీలకులు – పార్లమెంటు నియోజక వర్గం

1. సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ – శ్రీకాకుళం
2. కొరికాన రవికుమార్ – విజయనగరం
3. కొణతాల రామకృష్ణ – విశాఖపట్నం
4. కొణిదల నాగబాబు – అరకు
5. పెండెం దొరబాబు – అనకాపల్లి
6. పంచకర్ల రమేష్ బాబు – అమలాపురం
7. సామినేని ఉదయభాను – కాకినాడ
8. కొటికలపూడి గోవిందరావు – రాజమహేంద్రవరం
9. బత్తుల బలరామకృష్ణ – ఏలూరు
10. పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) – నరసాపురం
11. కందుల దుర్గేష్ – విజయవాడ
12. పిడుగు హరిప్రసాద్ – మచిలీపట్నం
13. బొలిశెట్టి శ్రీనివాస్ – గుంటూరు
14. బాలినేని శ్రీనివాసరెడ్డి – నర్సరావుపేట
15. దేవ వరప్రసాద్ – బాపట్ల
16. కిలారు వెంకట రోశయ్య – ఒంగోలు
17. బొమ్మిడి నాయకర్ – నెల్లూరు
18. లోకం నాగ మాధవి – తిరుపతి
19. పత్సమట్ల ధర్మరాజు – చిత్తూరు
20. కళ్యాణం శివ శ్రీనివాస్ – రాజంపేట
21. చిలకం మధుసూదన్ రెడ్డి – కడప
22. టి.ఉదయ్ శ్రీనివాస్ – కర్నూలు
23. వల్లభనేని బాలశౌరి – నంద్యాల
24. చిల్లపల్లి శ్రీనివాసరావు – హిందూపురం
25. వేములపాటి అజయ కుమార్ – అనంతపురం