
Plants That Attract Snakes: వర్షాకాలం రాగానే ప్రకృతి అంతా పచ్చదనంతో మురిసిపోతుంది. కానీ, ఇదే సమయంలో మన ఇళ్ల చుట్టుపక్కల పాముల భయం కూడా ఎంతగానో పెరుగుతుంది. వర్షాల వల్ల వాటి నివాసాలు నీటితో నిండిపోవడంతో, అవి పొడి, వెచ్చని ప్రదేశాల కోసం బయటకు వస్తుంటాయి. అయితే, మన తోటల్లో పెంచే కొన్ని రకాల మొక్కలు, చెట్లు పాములను అమితంగా ఆకర్షిస్తాయనే విషయం మీకు తెలుసా?
పచ్చదనం వెనుక దాగున్న ప్రమాదం.. ఈ చెట్ల వేర్లలోనే నివాసం..!: మన ఇల్లు, పొలం లేదా కార్యాలయాల చుట్టూ ఉండే కొన్ని మొక్కల వేర్లు, పొదలు, వాటి బెరడులు పాములు దాక్కోవడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి అత్యంత అనుకూలమైన స్థలాలుగా మారుతుంటాయి. ముఖ్యంగా వర్షాలు పడే రోజుల్లో ఈ ప్రదేశాలలో తేమ, చీకటి ఎక్కువగా ఉండటం వల్ల పాములు ఇక్కడికి రావడానికి ఇష్టపడతాయి. మనకు తెలియకుండానే మనం పెంచే కొన్ని మొక్కలు వాటికి ఆశ్రయమిస్తున్నాయి. అలాంటి 6 రకాల మొక్కలు, చెట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాములకు ఇష్టమైన ఆ 6 మొక్కలు, చెట్లు ఇవే:
అరటి చెట్టు: అరటి చెట్టు ఎప్పుడూ తేమగా, చల్లని నిడనిస్తూ, మెత్తగా ఉంటుంది. ఈ వాతావరణాన్ని పాములు ఎంతగానో ఇష్టపడతాయి. వర్షాకాలంలో అరటి చెట్టు వేర్లు, దాని కాండం మధ్య ఉండే ఖాళీ ప్రదేశాలు పాములు సులభంగా దాక్కోవడానికి అనువుగా ఉంటాయి.
రావి, మర్రి చెట్లు: ఈ రెండు చెట్లు ఎంతో దట్టమైన నీడను ఇస్తాయి, కానీ అంతే ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడతాయి. వీటి జడలు లాంటి వేర్లు, మందపాటి కొమ్మలు పాములు పైకి ఎగబాకడానికి, దాక్కోవడానికి సురక్షితమైన స్థావరాన్ని అందిస్తాయి.
వెదురు చెట్లు: వెదురు పొదలు ఎంతో దట్టంగా పెరుగుతాయి. వీటి కింద ఉండే నేల ఎప్పుడూ తడిగా ఉంటుంది. ఈ వాతావరణం పాములు గుంతలు చేసుకోవడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కొన్నిసార్లు వెదురు బొంగుల మధ్య ఉండే ఖాళీల్లో కూడా ఇవి దూరి కూర్చుంటాయి.
తులసి మొక్క: తులసి మొక్కను మనం అత్యంత పవిత్రంగా భావిస్తాము. కానీ, తులసి మొక్క చుట్టూ గడ్డి లేదా చిన్న చిన్న పొదలు పెరిగితే, అవి పాములకు సులభమైన నివాసాలుగా మారుతాయి. అందుకే వర్షాకాలంలో తులసి కోట చుట్టుపక్కల ప్రాంతాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
వేప చెట్టు: వేప ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క అయినప్పటికీ, అది పాములకు వెచ్చని, సురక్షితమైన వాతావరణాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వేప నుంచి రాలి కిందపడే ఎండిన ఆకుల కింద పాములు చాలా హాయిగా పడుకుంటాయి. కాబట్టి మీ ఇంటి వద్ద వేప చెట్టు ఉంటే దాని కింద ఆకులు పేరుకుపోకుండా చూసుకోవాలి.
గన్నేరు, పాల మొక్కలు: అందమైన పూలు పూసే గన్నేరు (ఓలియాండర్) వంటి మొక్కలు, అలాగే కొమ్మలు విరిస్తే పాలు కారే కొన్ని రకాల చెట్లు పాములను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇవి దట్టమైన ఆకులను కలిగి ఉండి, పాములు సులభంగా నక్కి ఉండటానికి సహాయపడతాయి.
(గమనిక: పైన పేర్కొన్న విషయాలు అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సాధారణ సమాచారం ఆధారంగా ఇవ్వబడినవి. దీనిని కేవలం అవగాహన కోసం మాత్రమే చదవగలరు.)
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..