Reading Time: < 1 minute

పెద్దాపురం సబ్‌ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ.. పాయకరావుపేటలో పోలీసులకు దొరికాడు !

Caption of Image.

పెద్దాపురం: కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్‌జైలులో కలకలం రేగింది. రిమాండ్ ఖైదీ పరారీ అయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. బైక్ దొంగతనం కేసులో రిమాండ్‌లో ఉన్న పోతుల సుందరం జైలు నుంచి తప్పించుకున్నాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో పోలీసులు తప్పించుకున్న ఖైదీని పట్టుకున్నారు.

జైలు సిబ్బంది సహకారంతోనే పరారయ్యాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖైదీ జైలు క్యాంటీన్‌లోనే దాక్కున్నాడని అధికారులు వివరణ ఇచ్చారు. ఘటనపై సీసీ కెమెరా ఫుటేజీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఖైదీ జైలు నుంచి ఎలా బయటకు వెళ్లాడన్న దానిపై విచారణ కొనసాగుతోంది.

©️ VIL Media Pvt Ltd.