
- గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఘటన
జూబ్లీహిల్స్, వెలుగు: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ఆదివారం వన్‌వే ట్రయల్ రన్ లో భాగంగా ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న పోలీస్‌సిబ్బంది మంత్రి అశోక్‌కుమార్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని ఎడమ కాలి చీలమండ విరగడంతో రోడ్డుపైనే కుప్పకూలిపోయారు.
ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు, తోటి సిబ్బంది అశోక్‌కుమార్‌ను ఓ ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. బాధితుడు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ పోలీసులు తెలిపారు.