
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సర్కారు హైస్కూళ్లు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, గురుకులాల్లో ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ను బోధిస్తున్న 1,900 మందికి వెంటనే రెన్యువల్ ఆర్డర్లు జారీ చేయాలని ఒకేషనల్ ట్రైనర్స్ యూనియన్ (టీవీటీఏ) రాష్ట్ర నాయకులు ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో కోరారు.
జూన్ 15నే బడులు ప్రారంభమైనా, ఇప్పటివరకు ఉత్తర్వులు రాకపోవడంతో వృత్తి విద్యా బోధన నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.