Reading Time: < 1 minute

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్..

Caption of Image.

ఏపీలో రాజకీయ దుమారం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజును అరెస్ట్ చేశారు పోలీసులు.మంగళవారం ( జూన్ 23 ) అతనిని పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో నాగరాజు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 

ఈ కేసుకి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ అధికారులు నాగరాజు నివాసానికి వెళ్లి అతనిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నాగరాజు అనుచరులు, కుటుంబసభ్యులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నాగరాజు వర్గాన్ని చదరగొట్టిన పోలీసులు నాగరాజును అరెస్ట్ చేసి విచారణ కోసం పోలీస్ గెస్ట్ హౌస్ కు తరలించారు. నాగరాజు అరెస్ట్ పై పోలీసుల నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.