Reading Time: 2 minutes
Jabardasth Faima: సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. వరుడు ఎవరంటే? వీడియో ఇదిగో

జబర్దస్త్ ఫైమా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ తో కలిసి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లంటే హంగులు, ఆర్భాటాలు ఉంటాయి. కానీ ఫైమా మాత్రం చాలా సింపుల్ గా రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. రిజిష్టర్ ఆఫీస్ లో ప్రవీణ్ నాయక్ తో కలిసి పూల దండలు మార్చుకుంటోన్న వీడియోను షేర్ చేసిన ఫైమా ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది. ‘వారు మమ్మల్ని అనుమానించారు. విమర్శించారు. విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు. కానీ మా తొమ్మిదేళ్ల ప్రేమ ప్రతి అడ్డంకినీ, సమస్యను అధిగమించి బలంగా నిలిచింది. లెక్కలేనన్ని పోరాటాలు. అంతులేని సహనం. వదిలేయడానికి వేయి కారణాలున్నా.. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ఎంచుకున్నాం. ఫైనల్‌గా ఈ రోజు మేము భార్యాభర్తలం అయ్యాం’ అంటూ తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది ఫైమా. ఈ పోస్టుకు #FinallyMarried #9yearsOfLove #AgainstAllOdds #ForeverStartsNow అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఫైమా పెళ్లి వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఫైమా- ప్రవీణ్‌ లకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

ప్రవీణ్ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే

కాగా ఫైమా గతంలో జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ తో ప్రేమలో ఉందని ప్రచారం జరిగింది. జబర్దస్త్ వేదికపై వీరిద్దరు కలిసి చేసిన స్కిట్స్ సూపర్ హిట్ అయ్యాయి. బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. దీంతో ఆన్ స్క్రీనే కాదు ఆఫ్ స్క్రీన్ లోనూ వీరు ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారని పుకార్లు వచ్చాయి. అయితే ఏమైందో కానీ ఇద్దరూ విడిపోయారు. కొన్ని రోజుల క్రితమే జబర్దస్త్ ప్రవీణ్ కడెం వంశితతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఫైమా కూడా తన ప్రియుడు ప్రవీణ్ తో కలిసి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది.  అయితే ఇలా సింపుల్ గా రిజిష్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఫైమా పెళ్లి వీడియో ఇదిగో..

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

భర్త ప్రవీణ్ నాయక్ తో ఫైమా..

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.