
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ సూపర్ స్టార్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మరోసారి తన సత్తా చాటాడు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన గ్రూప్-K మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన రొనాల్డో.. ప్రపంచకప్ చరిత్రలో ఆరు వేర్వేరు ఎడిషన్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్రను సాధించాడు. రొనాల్డో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు చేరువైంది.
హ్యూస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఆరో నిమిషంలోనే గోల్ చేసి జట్టుకు ఆధిక్యం అందించాడు. జావో కాన్సెలో ఇచ్చిన అద్భుత క్రాస్‌ను గోల్‌గా మలిచిన రొనాల్డో.. తన ట్రేడ్‌మార్క్ “సీయూ” సెలబ్రేషన్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. ఈ గోల్‌తో 2006 నుంచి 2026 వరకు ఆరు ప్రపంచకప్‌లలో గోల్ చేసిన తొలి ఫుట్‌బాలర్‌గా నిలిచి మరో చారిత్రక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
Ronaldo telling Bruno where to put the ball.
41 years with this speed! pic.twitter.com/IHzmZvqxHR
— KALYJAY (@gyaigyimii) June 23, 2026
తర్వాత 17వ నిమిషంలో నునో మెండెస్ ‘ఫ్రీకిక్’ను గోల్‌గా మలచడంతో పోర్చుగల్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి అర్ధభాగం ముగియడానికి ఆరు నిమిషాల ముందు బ్రూనో ఫెర్నాండెస్ ఇచ్చిన అద్భుత పాస్‌ను అందుకున్న రొనాల్డో మరోసారి గోల్ చేసి స్కోరును 3-0కి చేర్చాడు. దీంతో ప్రపంచకప్ లలో రొనాల్డో గోల్స్ సంఖ్య 10కి చేరింది. పోర్చుగల్ తరఫున ప్రపంచకప్‌లలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కూడా రొనాల్డో రికార్డులేకెక్కాడు.
ఈ మ్యాచ్‌కు ముందు డీఆర్ కాంగోతో జరిగిన తొలి మ్యాచ్‌లో రొనాల్డో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు విశ్లేషకులు అతడి ఆటతీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఉజ్బెకిస్తాన్‌పై అద్భుత ప్రదర్శనతో రొనాల్డో తన విమర్శకులందరికీ మైదానంలోనే సమాధానం ఇచ్చాడు. రొనాల్డో రెండో గోల్ తర్వాత కూడా పోర్చుగల్ దూకుడు కొనసాగింది. ఉజ్బెకిస్తాన్ గోల్ సాధించినప్పటికీ VAR జోక్యంతో అది రద్దయింది. అనంతరం వచ్చిన కార్నర్‌లో ప్రత్యర్థి గోల్‌కీపర్ అబ్దువోఖిద్ నెమాటోవ్ చేసిన ఓన్ గోల్‌తో స్కోరు 4-0గా మారింది. చివర్లో ప్రత్యామ్నాయ ఆటగాడు రఫాయెల్ లియావో మరో గోల్ చేయడంతో పోర్చుగల్ 5-0 భారీ విజయాన్ని నమోదు చేసింది.
El GOLAZO desde la grada de Cristiano Ronaldo y todo el banquillo se fue a abrazarlo.
BRUTAL
pic.twitter.com/BK0HPXJTnL
— (fan) REAL MADRID FANS
(@AdriRM33) June 23, 2026
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రొనాల్డో జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. “ఈ విజయంతో చాలా ఆనందంగా ఉంది. కానీ నాకు వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం ముఖ్యమైనది. ఈ రోజు మేము ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాం. జట్టు ఆటలో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. రికార్డులు రావడం సంతోషమే కానీ నా లక్ష్యం ఎప్పుడూ జాతీయ జట్టుకు విజయాలు అందించడమే” అని పేర్కొన్నాడు.
ప్రపంచకప్‌లలో రొనాల్డో గోల్స్ వివరాలు:
* 2006 ప్రపంచకప్ – 1 గోల్
* 2010 ప్రపంచకప్ – 1 గోల్, 1 అసిస్ట్
* 2014 ప్రపంచకప్ – 1 గోల్, 1 అసిస్ట్
* 2018 ప్రపంచకప్ – 4 గోల్స్
* 2022 ప్రపంచకప్ – 1 గోల్
* 2026 ప్రపంచకప్ – 2 గోల్స్ (ప్రస్తుతం)
You voted Cristiano Ronaldo @MichelobUltra Superior Player of the Match!
#FIFAWorldCup #SuperiorPOTM pic.twitter.com/SrhqRpb76k
— FIFA World Cup (@FIFAWorldCup) June 23, 2026
Ronaldo telling Bruno where to put the ball.

(@AdriRM33) 