Reading Time: < 1 minute

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ 

Caption of Image.

గతంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో వార్తల్లో నిలిచిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వల్ల టీడీపీ కార్యాకర్తలు ఇబ్బంది పడుతున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల గురించి ఎంపీ మహేష్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.  బుధవారం ( జూన్ 24 ) ఏలూరు దిశా మీటింగ్ లో మాట్లాడుతూ పోలీసులను ఉద్దేశించి ఈమేరకు వ్యాఖ్యలు చేశారు ఎంపీ మహేష్. ఎక్కడ పడితే అక్కడ, గ్రామాల్లో కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నారని.. కేసులు నమోదు చేసి చలాన్లు వేస్తున్నారని అన్నారు. 

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల తమ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని.. తనకు రోజుకు 30 ఫోన్లు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల గురించే వస్తున్నాయని అన్నారు.డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో చూసి చూడనట్లు వదిలేయాలని పోలీసులకు సూచించారు ఎంపీ మహేష్.

ఈ విషయంలో పోలీసులు స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేక వస్తుందని అన్నారు. అంతేకాకుండా.. రూల్స్ అమలు చేసే విషయంలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలని…తమ పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తల విషయంలో కఠినంగా ఉండద్దని పోలీసులను కోరారు ఎంపీ మహేష్.

©️ VIL Media Pvt Ltd.