Reading Time: < 1 minute
Rajinikanth173 Title Dharman The Deadly Doctor First Look Also Out

సూపర్‌స్టార్ రజనీకాంత్ 173సినిమాపై సస్పెన్స్ తొలగిపోయింది. మొదట ఈ సినిమాను సుందర్ సి దర్శకత్వంలో ప్రకటించారు. కానీ సుందర్ సి అనుకోని కారణాలతో ఈ సినిమా నుండి వైదొలిగాడు. దాంతో రజనీ 173కి డైరెక్టర్ ఎవరనేదానిపై పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి కానీ అవేవి కన్ఫామ్ కాలేదు. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు రజినీని డైరక్ట్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రానికి ‘ ధర్మన్’ ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ.. తాజాగా మేకర్స్ అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ది డెడ్లీ డాక్టర్’గా రజనీకాంత్ మాస్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రజనీకి జోడిగా తమిళ్ సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించబోతోంది. అలాగే యంగ్ హీరోయిన్ రాశిఖన్నా కూడా ముఖ్య పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కాస్త అయోమయం నెలకొంది. గతంలో చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఎలాంటి రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రస్తావించలేదు. దీనికి ప్రధాన కారణం రజనీకాంత్ నటిస్తున్న మరో సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’  అని తెలుస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘జైలర్ 2’ ఈ ఏడాది చివరి త్రైమాసికంలో థియేటర్లలోకి వచ్చేందుకు షెడ్యూల్ చేయబడింది. రజనీకాంత్ లాంటి బిగ్ స్టార్ నటించిన రెండు భారీ చిత్రాల మధ్య కచ్చితంగా తగినంత గ్యాప్ ఉండటం బాక్సాఫీస్ పరంగా చాలా అవసరం. అందుకే ‘జైలర్ 2’ విడుదలైన వెంటనే కాకుండా, ‘ది డెడ్లీ డాక్టర్’ చిత్రాన్ని 2027 సమ్మర్ సీజన్‌కు పోస్ట్‌పోన్ చేయాలని మేకర్స్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.