Reading Time: 2 minutes

పిల్లల స్నాక్స్ : స్కూల్ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు సింపుల్ గా చేసిపెట్టే స్నాక్స్

Caption of Image.

పిల్లలు బడిబాట పట్టారు. పొద్దున్నే సమయం చాలా తక్కువుగా ఉంటుంది.  పొద్దున్నే ఎనిమిదిగంటలు కాగానే బస్​ హారన్​ మోగుతుంది.  ఆ సమయానికే పిల్లలకు బ్రేక్​ ఫాస్ట్​ పెట్టేయాలి. స్కూల్లో లంచ్​ సరిగా చేస్తారో .. చేయరో  తెలియదు.. ఏదో కొద్దిగా తిని ముగించే పిల్లలే ఎక్కువ మంది ఉంటారు.  ఇక స్కూల్​ నుంచి రాగానే పిల్లలు అలసిపోయి చాలా నీరసంగా ఉంటారు.  అలాంటప్పుడు వారికి మంచి ఉత్సాహాన్నిచ్చేవెరైటీ ఫుడ్​ కావాలి.  కొంతమందైతే అమ్మా.. ఏమన్నా పెట్టు అంటుంటారు.. అలాంటప్పుడు చాలా సింపుల్​గా తయారు చేసే ఈవెనింగ్​స్నాక్స్​ గురించి తెలుసుకుందాం..!

బకర్ వాడి వైరైటీ స్నాక్స్​ తయారీకి కావాల్సినవి

  • గోధుమపిండి – ఒక కప్పు
  • శెనగపిండి- ముప్పావు కప్పు
  • పసుపు- ఒక టీ స్పూన్
  • కారం – ఒక టేబుల్ స్పూన్
  • నూనె – వేగించడానికి సరిపడా
  • గసగసాల, నువ్వులు- ఒక్కోటి పావుకప్పు చొప్పున
  • వేగించిన కొబ్బరి తురుము – అర కప్పు
  • అల్లం తరుగు – ఒక టీ స్పూన్
  • పచ్చిమిర్చి తరుగు – ఒకటిన్నర టీ స్పూన్ 
  • ధనియా, జీలకర్ర పొడి – ఒక్కోటి అరటేబుల్ స్పూన్ చొప్పున
  • ఇంగువ – పావు టీ స్పూన్
  • కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
  • నిమ్మరసం- రెండు టీ స్పూన్లు
  • ఉప్పు – సరిపడా

బకర్ వాడి వైరైటీ స్నాక్స్ తయారీ విధానం

 గోధుమపిండి, శెనగపిండి,కారం, పసుపు, ఒక టేబుల్ స్పూన్ నూనె, చిటికెడు ఉప్పు వేసి సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. అరగంట సేపు ఆ మిశ్రమాన్ని పక్కనుంచాలి. ఆ లోపు పాన్​ లో  ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి గసగసాలు, నువ్వులు, కొబ్బరి తురుము వేసి నిమిషం ఉంచి దింపాలి. 

వేడిచల్లారాక పొడిపొడిగా మిక్సీ పట్టి గిన్నెలోకి తీయాలి. అందులో పచ్చిమిర్చి, అల్లం తరుగు, ధనియాలపొడి, జీలకర్ర పొడి, మిగిలిన కారం, తగినంత ఉప్పు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, ఇంగువ వేసి బాగా కలపాలి. చపాతీ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మందపాటి చపాతీల్లా వత్తి దానిపై నువ్వుల మిశ్రమం పరిచి రోల్లా చుట్టాలి. అంచుల్ని తడిచేత్తో అతికించి చక్రాల్లా కట్ చేసి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. 

రసీలా బూందీ తయారీకి కావాల్సినవి

  • శెనగపిండి – ఒక కప్పు 
  • చక్కెర-రెండు కప్పులు
  •  నూనె – వేగించడానికి సరిపడా 
  • రోజా వాటర్ – పావు టీ స్పూన్ 

రసీలా బూందీ తయారీ విధానం

శెనగపిండిలో తగినన్ని నీళ్లు పోసి బూందీ పిండిలా కలపాలి. పాన్​ లో  నూనె వేడిచేయాలి. దానిమీద బూందీ జల్లీపెట్టి, పైన శెనగపిండి మిశ్రమం పోసి రుద్దాలి. జల్లీ నుంచి పిండి జారి, నూనెలో పడుతుంది. బూందీని వేగించి, తీసి పక్కన పెట్టాలి. 

చక్కెరలో రెండు కప్పుల నీళ్లు పోసి, పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. గులాబ్ జామూన్ కోసం ఎలా పంచదార పాకం చేసుకుంటామో అలాగే దీన్నీ తయారు చేసుకోవాలి. ఈ పంచదార పాకంలో రోజ్ వాటర్ కలపాలి. చివరిగా పంచదార పాకంలో వేగించిన బూందీ వేసి కలిపితే యమ్మీయమ్మీ రసీలా బూందీ రెడీ.

దబేలీ స్నాక్స్​ తయారీకి కావాల్సినవి

పాప్​ లు – రెండు

  • దబేలీ మసాలా- రెండు టీ స్పూన్లు
  • వెన్న- రెండు టేబుల్ స్పూన్లు
  • చింతపండు గుజ్జు-కొద్దిగా
  • రెడ్ చిల్లీ సాస్-ఒక టీ స్పూన్
  • దానిమ్మ గింజలు- కొద్దిగా
  • ఉల్లిగడ్డ తరుగు – ఒక టేబుల్ స్పూన్
  • అలుగడ్డలు-రెండు
  • సన్నకారపూస- కొద్దిగా
  • ఉప్పు- తగినంత
  • కారం-తగినంత
  • పసుపు – చిటికెడు
  • ట్యూటీ ఫ్రూటీ-కొద్దిగా
  • వేగించిన పల్లీలు- కొద్దిగా
  • ఎండుకొబ్బరి పొడి-కొద్దిగా

మసాలా కోసం కావలసినవి

  • ఎండుమిర్చి- ఒక టీ స్పూన్ 
  • ధనియాలు -ఒక టీస్పూన్​
  •  దాల్చిన చెక్క ముక్క, 
  •  లవంగాలు – రెండు
  • జీలకర్ర  – పావు టీ స్పూన్  
  • వీటిని వేగించి పొడిచేస్తే దబేలీ మసాలా రెడీ అవుతుంది.

దబేలా స్నాక్స్​ తయారీ విధానం

ఆలుగడ్డల్ని ఉడికించి మెత్తగా మెదపాలి. పాన్​ లో నెయ్యి వేసి కరిగాక ఉల్లిగడ్డ తరుగు, పసుపు, కారం, ఉప్పు, దబేలీ మసాలా వేసి వేగించాలి. అందులో చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఇంకాసేపు మరిగించాలి. ఆలుగడ్డ గుజ్జు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి. 

మిశ్రమం కాస్త చల్లారాక ఎండుకొబ్బరి పొడి, టూటీఫ్రూటీ, దానిమ్మ గింజలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పాప్​ లని మధ్యకి కట్ చేసి రెడ్ చిల్లీ సాస్, వేగించిన పల్లీలు, ఆలుగడ్డ మిశ్రమం స్టఫ్ చేసి వెన్నలో రెండు వైపులా కాల్చాలి. ఆపై సన్నకారప్పూసతో గార్నిష్ చేస్తే ఇండియన్ బర్గర్ దబేలీ రెడీ..
 

©️ VIL Media Pvt Ltd.