Reading Time: 2 minutes
ఢిల్లీ పంట పండింది పో.. తక్కువ ధరకే దక్కిన స్టార్ ప్లేయర్! ట్రేడ్ డీల్‌పై అధికారిక ప్రకటన

అంతా ఊహించినట్టుగానే జరిగింది. పంత్ లక్సో సూపర్ జెయింట్స్‌ను వదిలేసి, తన సొంతగూటికి చేరిపోయాడు. ట్రేడ్ డీల్‌లో భాగంగా రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. బదులుగా తమ టీమ్‌లో ఉన్న వరల్డ్ క్లాస్ క్వాలిటీ స్పిన్నర్, చైనామెన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను ఎల్ఎస్‌జీకి ఇచ్చేసింది. ఈ ట్రేడ్ జరుగుతుందనే విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగిపోతూనే ఉంది. పలు వార్తా సంస్థలు కూడా ఈ ట్రేడ్ డీల్ గురించి ముందుగానే లీకులు ఇచ్చేశాయి. అయితే తాజాగా ఐపీఎల్ ఎక్స్ అకౌంట్ నుంచి ఈ డీట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

అయితే ఈ ట్రేడ్ డీల్‌లో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. పంత్‌కు చెల్లించబోయే ధర. ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడి రికార్డు పంత్ పేరిటే ఉంది. లక్నో అతనికి ఏకంగా రూ.27 కోట్లు చెల్లించింది. అలా ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. అయితే ఈ ట్రేడ్ డీల్‌లో మాత్రం పంత్ ధర భారీగా తగ్గింది. గత సీజన్‌లో రూ.27 కోట్లు అందుకున్న పంత్.. వచ్చే సీజన్‌లో అంటే ఐపీఎల్ 2027లో మాత్రం కేవలం రూ.15 కోట్లు మాత్రమే పొందనున్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.13.5 కోట్లు చెల్లించనుంది.

2016 నుండి 2024 మధ్య తొమ్మిది సీజన్ల పాటు పంత్ ఢిల్లీ టీమ్‌కు ఆడిన విషయం తెలిసిందే. డీసీ తరఫున 111 మ్యాచ్‌‌లు ఆడాడు. దాదాపు దశాబ్ద కాలంగా ఈ ఫ్రాంచైజీకి ఒక కీలకమైన ఆటగాడిగా ఉన్న అతను, 2021 నుండి 2024 వరకు నాలుగు సీజన్లలో 43 మ్యాచ్‌లకు జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. 2025 వేలంలో పంత్‌ను ఎల్‌ఎస్‌జి జట్టు రికార్డు స్థాయిలో 27 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. ఈ ట్రేడ్ తర్వాత అతను రూ.15 కోట్లకు సవరించిన ఫీజుతో డిసి జట్టులో తిరిగి చేరనున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి