
మహారాష్ట్ర రాజకీయాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC), ట్రిపుల్ తలాక్ అంశాలపై కొత్త వివాదం చెలరేగింది. ఎన్‌సీపీ (అజిత్ పవార్ వర్గం) ఎమ్మెల్యే సనా మాలిక్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే సానా మాలిక్ చేసిన ప్రకటన కలకలం రేపింది. భారత్ లో ఖురాన్ ఆధారిత చట్టాలను అమలు చేయాలని, ట్రిపుల్ తలాక్‌ను సమర్థించాలని మాలిక్ డిమాండ్ చేశారు. పాకిస్తాన్, ఖురాన్, ముస్లిం వ్యక్తిగత చట్టాలను ఉటంకిస్తూ, భారతదేశంలో ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని ఎన్‌సీపీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లాగే, భారత్ కూడా ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆమె తెలిపారు.
ట్రిపుల్ తలాక్ గురించి
ట్రిపుల్ తలాక్‌ను సమర్థిస్తూ సనా మాలిక్.. “విడాకులలో వివిధ రూపాలు ఉన్నాయి. తలాక్-ఎ-హసన్, తలాక్-ఎ-అహ్సన్, తలాక్-ఎ-బిద్దత్ అనే మూడు రకాల విడాకులు ఉన్నాయి. ట్రిపుల్ తలాక్‌కు సంబంధించి ఆమోదించిన చట్టం, అప్పటికే ఆచరణలో విస్తృతంగా అమలులో లేని ఒక వ్యవస్థపై ఆధారపడి ఉంది. దాని ప్రస్తావన ఎక్కడా లేదు.” ఆ తర్వాత బహుభార్యత్వం గురించి మాట్లాడుతూ, “బహుభార్యత్వం కేవలం ఒక మతంలోనే కాకుండా, ప్రతి మతంలోనూ ప్రబలంగా ఉంది. ముస్లింలలో బహుభార్యత్వం గురించి బోధిస్తారు. దానిని పాటించాలి. దీని కోసం ఒక చట్టాన్ని రూపొందించాలని అన్నారు.
ఎక్స్‌లో వీడియో పోస్ట్
తన వ్యాఖ్యలకు సంబంధించి సనా మాలిక్ సామాజిక మాధ్యమ వేదిక Xలో ఒక వీడియోను పంచుకున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం అమలుపై అసెంబ్లీలో తన అభిప్రాయాన్ని వెల్లడించానని, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని మతాలకు సమానంగా వర్తించే చట్టాలు ఉండాలని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఈ అంశంపై జరిగిన చర్చలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి యోగేష్ కదమ్ స్పందించారని, చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత అవి అన్ని మతాలకు వర్తిస్తాయని ఆయన చెప్పినట్లు వెల్లడించారు.
నితేష్ రాణే ఫైర్
ఇదిలా ఉండగా, ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు సనా మాలిక్ పై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ, అసెంబ్లీలోని కొందరు ఖురాన్, ముస్లిం గ్రంథాలను ఉటంకిస్తూ యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
యూసీసీ గురించి రాజ్యాంగంలో ప్రస్తావించారు, కానీ కొందరు తమ చట్టవిరుద్ధ చర్యలను సమర్థించుకోవలసి వచ్చినప్పుడు మాత్రమే దానిని ప్రస్తావిస్తారు. ఎవరైనా దేశ చట్టాలను, రాజ్యాంగాన్ని పాటించకూడదనుకుంటే, వారు తమ పదవికి రాజీనామా చేసి పాకిస్తాన్‌కు వెళ్ళిపోవాలి అని సూచించారు.
ट्रिपल तलाक कायदा लागू करण्यासंबंधी आज विधानसभेत उपस्थित केलेल्या लक्षवेधी दरम्यान माझी भूमिका मांडली. बहुपत्नित्वाची प्रथा अनेक धर्मात सुरू आहे. त्यामुळे कोणताही कायदा लागू होताना तो संविधानाच्या आधारावर असायला हवा. कोणत्याही एका धर्माविरोधातील सूर त्यातून उमटायला नको, असे मत… pic.twitter.com/nWlqFUBihV
— Sana Malik-Shaikh ثنا ملک-شیخ सना मलिक-शेख (@sanamalikshaikh) June 23, 2026