Reading Time: 2 minutes
ఇండస్ట్రీలోనే తోపు విలన్.. చిరంజీవితో బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. గవర్నమెంట్ ఇన్సురెన్స్ కంపెనీలో క్లర్క్..

కాలం ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం ఇస్తుందో ఊహించడం అసాధ్యం. దాదాపు 21 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టి పాపులర్ నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. అతడి నటనతో భారతీయ సినిమాపై చెరగని ముద్ర వేశారు. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ నటుడు అమ్రిష్ పూరి. ఆయన పంజాబ్ లో జన్మించారు. అతడి అన్నలు మదన్ పూరి, సమన్ పూరి అప్పటికే సినిమాల్లో నటిస్తున్నారు. ప్రముఖ గాయకుడు, నటుడు కె.ఎల్. సైగల్ కూడా అతని కజిన్. అయినప్పటికీ, బాలీవుడ్‌లో తనకంటూ ఒక పేరు సంపాదించుకోవడం అతనికి అంత సులభం కాలేదు. నటుడు కావాలనే కలతో అమ్రిష్ పూరి చిన్న వయసులోనే ముంబైకి వచ్చారు. ఆయన ఒక ఆడిషన్‌లో పాల్గొ్న్నారు. కానీ ఎంపిక కాలేదు. దీంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయి చదువుపై దృష్టి పెట్టారు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)లో క్లర్క్ గా ఉద్యోగం సంపాదించారు. అయినప్పటికీ నటనపై ఆసక్తి తగ్గలేదు. ఆయన 21 ఏళ్లపాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ, అప్పుడప్పుడు నాటకాల్లో నటించేవారు. సినిమా అవకాశాల కోసం పోరాడుతున్న ఆ వ్యక్తికి 40 ఏళ్ల వయసులో మొదటి అవకాశం లభించింది.

ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..

ఆయన గంభీరమైన శరీరాకృతి, గంభీరమైన స్వరం ఆయనకు ఒక ప్రతినాయకుడి పాత్రను కూడా సంపాదించిపెట్టాయి. అమ్రిష్ పూరి 1971లో ‘రేష్మా ఔర్ షేరా’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ, త్వరలోనే దర్శకులు ఆయన నటనను గుర్తించారు. ‘నిశాంత్’, ‘మంథన్’, ‘అర్థ్ సత్య’ వంటి బాలీవుడ్ చిత్రాలలో ఆయన నటనకు విశేష ప్రశంసలు లభించాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలో విలన్ పాత్రలో నటించారు. కేవలం పవర్ ఫుల్ విలన్ పాత్రలు మాత్రమే కాకుండా హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‏లో ఉన్న వెబ్ సిరీస్..

తన సుధీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. నాటకరంగానికి ఆయన చేసిన సేవలకు గానూ 1979లో సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా అప్పట్లో పాపులర్ అయ్యాడు. 2005 జనవరి 12న అమ్రిష్ పూరి కన్నుమూశారు.

ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..