Reading Time: < 1 minute
Samantha Confirms Pregnancy Announces Maternity Leave At Maa Inti Bangaram Success Meet

కొద్దిరోజులుగా సమంత ప్రెగ్నెన్సీ గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి ఆమె టీ షర్ట్, జీన్స్‌లో కనిపించింది. ఈ క్రమంలోనే బేబీ బంప్ కనిపించిందని మీడియాలో పెద్ద ఎత్తున వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిసిన క్రమంలో, మెగాస్టార్ చిరంజీవి కూడా కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న సమంత దంపతులకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆయన మరింత లీక్ చేసినట్లయింది.

ఇప్పుడు తాజాగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని సమంత కన్ఫర్మ్ చేసింది. “ఎవరికైనా ఇంత మంచి సక్సెస్ వచ్చాక గ్యాప్ తీసుకోకుండా వరుస సినిమాలు చేయాలనుకుంటారు, మీరేమనుకుంటున్నారు?” అని ఒక విలేకరి ప్రశ్నించగా.. “సారీ అండి, మరోసారి గ్యాప్ తీసుకోవాల్సి వస్తుంది. నేను మెటర్నిటీ లీవ్ తీసుకోవాలి” అని చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పటివరకు సమంత ప్రెగ్నెన్సీ గురించి వస్తున్న వార్తలన్నింటికీ ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చినట్లయింది. ఈ క్రమంలో సమంత త్వరలో తల్లి కాబోతోందనే వార్త ఆమె నోటి ద్వారానే వినడంతో అభిమానులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.