
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కు నెల్లూరు జిల్లాలో ఆరుదైన గౌరవం దక్కింది.దాయపాలెం నుంచి పొదలకూరు రోడ్డు వరకు గాంధీనగర్ మార్గంలో నిర్మించిన కొత్త రోడ్డుకు అమరజవాన్ మురళి నాయక్ పేరు పెట్టారు ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు రూరల్‌లో ఇటీవల కాలంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు రూ. 700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా..వాటిలో ఇప్పటికే కొన్ని పూర్వవ్వగా మరికొన్ని ముగింపు దశకు చేరుకున్నాయి.
అయితే నగర పరిధిలోని వేదాయపాలెం నుంచి పొదలకూరు రోడ్డు వరకు గాంధీనగర్ మార్గంలో రూ.3 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు తాజాగా పూర్తయ్యాయి. దీంతో జనసేనకు చెందిన వీర మహిళలతో ఈ రోడ్డు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మరో అడుగు ముందుకేసి.. ఈ మార్గానికి ఆపరేషన్ సింధూర్‌లో వీరమరణం పొందిన మురళి నాయక్ పేరును నామకరణం చేశారు. అధికారికంగా త్వరలో ఈ పేరును ఖరారు చేసి బోర్డును కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గతంలో నెల్లూరు రూరల్ లో ఏర్పాటుచేసిన MSME పార్కుకు భారత్ సింధూర్ పార్కుగా నామకరణం చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి మరోసారి వీర జవాన్ పేరును రోడ్డుకు పెట్టడం ద్వారా మరోసారి వార్తల్లో నిలిచారు.
మురళీ నాయక్ ప్రాణత్యాగం
అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గ గోరంట్ల మండలానికి చెందిన కల్లీతాండ గ్రామంలో 2000 సంవత్సరంలో జన్మించిన మూదావత్ మురళి నాయక్ దేశమంటే అమితమైన భక్తి. పరిసర గ్రామాల్లో ఆర్మీలో పనిచేసేవారిని స్పూర్తిగా తీసుకొని ఎలాగైనా ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. ఆర్మీలో భారత్ పార్క్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న మురళి నాయక్ పెహల్గాం లో పాకిస్తాన్ కు చెందిన ముష్కరుల దాడుల్లో భారత్కు చెందిన 20 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పెహల్గాం రాడులకు సమాధానంగా ఆపరేషన్ సింధూరం భారత్ చేపట్టింది. ఈ పోరాటంలో పాకిస్తాన్ సైన్యంతో వీరోచితంగా పోరాడిన మురళి నాయక్ ప్రాణ త్యాగం చేశాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.