Reading Time: < 1 minute

ICC వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ రిలీజ్.. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే..!

Caption of Image.

న్యూఢిల్లీ: ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ రిలీజ్ అయ్యాయి. బుధవారం (జూన్ 24) ఐసీసీ విడుదల చేసిన జాబితాలో.. 815 పాయింట్లతో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డారెల్ మిచెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాళ్లు ఆధిపత్యం ప్రదర్శించారు. టాప్ 5లో ముగ్గురు మనోళ్లే ఉన్నారు. ఇటీవల స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడు స్థానాలు ఎగబాకి 2వ ర్యాంకుకు చేరుకున్నాడు.

గాయం కారణంగా ఆప్ఘాన్ సిరీస్‎కు దూరమైన భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (768) ఒక పాయింట్ కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. మరో భారత ప్లేయర్ రోహిత్ శర్మ 754 పాయింట్లతో యధావిధిగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఇబ్రహీం జర్దాన్ (712), బాబర్ అజాం (689), షై హోప్ (683), హ్యారీ టెక్టర్ (679), చరిత హసలంక (659), హ్యారీ బ్రూక్ (656) ఉన్నారు. 

ICC టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ రిలీజ్:

 ఐసీసీ టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‎లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్స్ దుమ్మురేపారు. తొలి ఐదు స్థానాల్లో నలుగురు ఈ రెండు దేశాలకు చెందిన ప్లేయర్సే ఉన్నారు. బుధవారం (జూన్ 24) ఐసీసీ విడుదల చేసిన జాబితాలో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జోరూట్ 871 పాయింట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మరో ఇంగ్లాండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ (866) రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ట్రావిస్ హెడ్ (853), స్టీవ్ స్మిత్ (831) నిలిచారు. 781 పాయింట్లతో శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్ ఐదో స్థానంలో ఉన్నాడు. 

©️ VIL Media Pvt Ltd.