Reading Time: < 1 minute

FIFA: పోర్చుగల్కు భారీ షాక్.. గ్రూప్–కె లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కొలంబియా

Caption of Image.

ఫిఫా వరల్డ్ కప్ 2026 లో పోర్చుగల్ కు కొలంబియా షాకిచ్చింది. టాప్ పొజిషన్ లో ఉన్న రొనాల్డో జట్టును వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కూర్చుంది. బుధవారం (జూన్ 24)న జరిగిన కొలంబియా vs DR కాంగో (COL vs COD)  పోటీలో కాంగోను ఓడించి టాప్ పొజిషన్ కు చేరుకుంది. 

గ్వాడలజారాలో జరిగిన గ్రూప్ K మ్యాచ్‌లో DR కాంగోను 1-0 తేడాతో ఓడించిన తర్వాత కొలంబియా, ఫీఫా ప్రపంచ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32కు అర్హత సాధించింది. DR కాంగో గోల్ కీపర్ లియోనెల్ ఎంపాసీ అద్భుతమైన సేవ్స్ చేసి మొదట కొలంబియాకు చాన్స్ ఇవ్వలేదు. కానీ..  తర్వాత, 76వ నిమిషంలో డేనియల్ మునోజ్ మ్యాచ్‌లో ఏకైక గోల్ చేసి, చివరకు డెడ్ లాక్ ను బ్రేక్ చేశాడు.  

పోర్చుగల్ ఇప్పటి వరకు గ్రూప్ కే లో టాప్ పొజిషన్ లో ఉంది. ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయంతో  రెండు మ్యాచ్‌ల నుండి నాలుగు పాయింట్లతో ఇప్పటి వరకు టాప్ లో ఉంది రొనాల్డో జట్టు. అయితే బుధవారం జరిగిన మ్యాచ్ విజయంతో పోర్చుగల్ ను వెనక్కు నెట్టి టాప్ లోకి  వెళ్లింది కొలంబియా.  

గ్రూప్ లో టాప్ పొజిషన్ అలాగే కనసాగాలంటే.. కొలంబియా ఇప్పుడు పోర్చుగల్‌తో జరిగే చివరి మ్యాచ్‌లో గెలవక పోయినా పర్లేదు.. ఓటమిని తప్పించుకుంటే సరిపోతుంది.

©️ VIL Media Pvt Ltd.