చాలా మంది మటన్ కర్రీని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి, నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ, బిర్యానీ ఆకు వేసి పోపులా పెట్టి కర్రీ వండుతారు. కానీ ఇలా కాకుండా, పోపు లేకుండా చలా సులభంగా మటన్ కర్రీని రుచికరంగా వండుకోవచ్చునంట. కాగా, అది ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు : మటన్ కేజీ, బిర్యానీ ఆకు, లవంగాలు, ఉల్లిపాయలు తరిగినవి, గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పచ్చి మిర్చి, నూనె,
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మటన్ తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడిగి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడ ఉప్పు, కారం, చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోనే గరం మసాలా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, చిన్న చిన్నగా కట్ చేసి బిర్యానీ ఆకు వేయాలి.
తర్వాత దీనిని కూడా చాలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొంచెం నూనె పోసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. మటన్ ముక్కలకు కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిసేలా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే, రుచి కూడా అంత బాగా ఉంటుంది. అందుకే మంచిగా కలుపుకోవాలి.
తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో ఈ మటన్ కర్రీ వేసి బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఉడికిన తర్వాత పచ్చి మిర్చీ వేయాలి. తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ మొత్తం మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. బాగా ఉడికిందంటే కర్రీ రెడీ. అంతే ఎలాంటి పోపు లేకుండా మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా వండిన కర్రీ చాలా రుచిగా ఉంటుందంట.




