Reading Time: < 1 minute

వీబీ డిజిటల్ మీడియా అవార్డ్స్

Caption of Image.

గత కొన్నేళ్లుగా సినిమా. టీవీ, డిజిటల్, సోషల్ మీడియా రంగాల్లో వి.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అవార్డులను అందజేస్తోంది. ఈ ఏడాది అవార్డుల వేడుకను బుధవారం ప్రసాద్ ల్యా బ్స్ లో ఏర్పాటుచేశారు. విష్ణు బొప్పన నిర్వహించిన ఈ కార్యక్రమానికి నిర్మాతలు కేఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ్, అంబికా కృష్ణ, పుస్కూర్ రామ్మోహన్ రావు, మాదాల రవి పాల్గొని అవార్డులను అందజేశారు. 

‘సోషల్ మీడియా, డిజిటల్ మీడియా క్రియేటర్లు తమ ప్రతిభను ప్రజల చైతన్యానికి, మంచి సందేశాల ప్రచారానికి ఉపయోగించాలని నిర్మాత కె.ఎస్.రామారావు కోరారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లా డుతూ ‘సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నేటి సమాజంపై ఎంతో ప్రభావం చూపుతు న్నారు. 

అందుకే బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని సూచించారు. డిజిటల్ మీడియా అవార్డులకు మంచి స్పందన లభిస్తోందని, ఈవెంట్ సక్సెస్ అయ్యేందుకు సహకరించిన అందరికీ బొప్పన విష్ణు థ్యాంక్స్ చెప్పారు.
 

©️ VIL Media Pvt Ltd.