Reading Time: 2 minutes
Mrunal Thakur: హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ తమ్ముడిని చూశారా? ఏం చేస్తున్నాడో తెలుసా? వీడియో ఇదిగో

హిందీతో పాటు తెలుగులోనూ వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాఠ్ ఠాకూర్. ముఖ్యంగా ఈ మధ్యన తెలుగులోనే అమ్మడికి మంచి సూపర్ హిట్ సినిమాలు పడుతున్నాయి. సీతారామం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదట మూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత న్యాచురల్ స్టార్ నానితో కలిసి హాయ్ నాన్న సినిమాలో నటించి వంద కోట్ల మూవీని ఖాతాలో వేసుకుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ది ఫ్యామిలీ స్టార్ యావరేజ్ గా నిలిచినా మృణాళ్ అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇటీవలే అడివి శేష్ నటించిన డెకాయిట్ మూవీతో మరో హిట్ సినిమాను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో మృణాళ్ యాక్టింగ్ నెక్స్ లెవెల్ అని విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తోంది మృణాళ్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉందంటూ ఈ బ్యూటీ గురించి తెగ ప్రచారం జరుగుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా తన తమ్ముడి గ్రాడ్యుయేషన్ డే వేడుకల కోసం అమెరికా వెళ్లింది మృణాల్. తన సోదరుడిని చూసి బాగా ఎమోషనల్ అయిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. ‘నువ్వు సాధించిన విజయం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. నా కలల్లో ఒకటి నిజమవ్వడం.. అది కూడా నువ్వు అంత సులువుగా సాధించడం కళ్లారా చూడటం చాలా ప్రత్యేకమైన అనుభూతి. నువ్వు మంచి వ్యక్తిగా రూపుదిద్దుకుంటున్న విధానం నన్ను గర్వపడేలా చేస్తున్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినందుకు అభినందనలు. గ్రాడ్యుయేషన్ వేడుక చాలా బాగా జరిగింది. అది చూస్తున్నప్పుడు మూవీ సీన్‌లో ఉన్నట్లు అనిపించింది. ఈ అనుభూతిని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను’ అని ఈ వీడియోలో చెప్పుకొచ్చింది మృణాల్. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

తమ్ముడితో మృణాళ్ ఠాకూర్.. వీడియో ఇదిగో..

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

కాగా మృణాళ్ తమ్ముడి పేరు మందార్ ఠాకుర్.. అమెరికాలోని చికాగోలో మాస్టర్స్ పూర్తి చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.