Reading Time: < 1 minute

కీసర గుట్టలో మొక్కలు నాటిన డైరెక్టర్ బలగం వేణు

Caption of Image.

మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. హరితసేన రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, కీసర మాజీ సర్పంచ్ నాయకపు మాధురి వెంకటేష్ ఆధ్వర్యంలో కీసరగుట్టలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ‘బలగం’ ఫేమ్ వేణు అక్కడ మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ బలగం వేణు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.మనం మొక్కలు నాటడం ద్వారా.. వచ్చే తరానికి మంచి గాలిని, కాలుష్యం లేని పర్యావరణాన్ని కానుకగా ఇచ్చిన వారం అవుతాము. పవిత్రమైన కీసరగుట్టలో మొక్కలు నాటేలా నాకు ఈ చక్కని అవకాశం కల్పించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహిళా అధ్యక్షురాలు మాధురి మేడమ్‌కు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని అన్నారు. పర్యావరణంపై సమాజంలో చైతన్యం తెస్తున్న హరితసేన, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృందాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. 

►ALSO READ | Ramcharan: ప్రధాని మోడీతో రామ్ చరణ్ దంపతులు.. ‘పాప్‌కార్న్’ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్!

©️ VIL Media Pvt Ltd.