Reading Time: 2 minutes
అస్సలు మోసపోవద్దు.. అలాంటివి జరగడంలేదు..! అలర్ట్ చేసిన మూవీ మేకర్స్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీమతి అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. వెంకటేష్, కళ్యాణ్ రామ్ సరసన కీర్తి సురేష్, కృతి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఘనంగా జరిగిన పూజా కార్యక్రమంతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. తాజాగా, హైదరాబాద్‌లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇటీవలే షూటింగ్ మొదలైంది.. సంక్రాంతికి సినిమాకు వస్తున్నాం అంటూ చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఒక ఫన్ వీడియో ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతుంది.

అనిల్ రావిపూడి కొత్త సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ లను ఎంపిక చేస్తున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన విడుదల చేశారు. చిత్రయూనిట్ ఎలాంటి సెలక్షన్స్ చేయడం లేదు అని అనౌన్స్ చేశారు. అనిల్ రావిపూడి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అనేసరికి చాలా మంది తమ పిల్లలని సినిమాల్లోకి పంపాలని కొందరికి డబ్బులు కట్టడం లాంటివి చేస్తున్నారు. దాంతో చిత్రయూనిట్ అలర్ట్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఇక సినిమా విషయానికొస్తే..

అనిల్ మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మరోసారి తన క్రియేటివిటీని చాటుకున్నారు. ప్రతి అప్డేట్‌ను సరదాగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే ముందుకు వస్తున్నారు అనిల్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి