Reading Time: < 1 minute

నేడు (జూన్ 25) బీజేపీ ఆధ్వర్యంలో ‘యాంటీ ఎమర్జెన్సీ డే’

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ హయాంలో దేశంపై బలవంతంగా రుద్దిన ఎమర్జెన్సీ చీకటి రోజులను నేటి తరానికి చాటిచెప్పేందుకు బీజేపీ ఆధ్వర్యంలో గురువారం రాజ్యాంగ హత్యాదినం నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జాతీయ నాయ కుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

బీజేపీ స్టేట్ ఆఫీసులో సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, మాజీ గవర్నర్లు బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగర్ రావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం పౌర హక్కులను హరించి లక్షలాది మందిని జైళ్లలో పెట్టిన అకృత్యాలను ఎండగట్టడమే ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.