
అమెరికా ఇరాన్ మధ్య వార్ ముగియటం.. హార్మూజ్ జలసంధి ఓపెన్ కావటంతో క్రూడ్ ఆయిల్ నుంచి బంగారం, వెండి వరకూ అన్నింటి ధరలు కుప్పకూలుతున్నాయి. కొన్ని నెలలుగా విపరీతంగా పెరుగుతూపోయిన వీటి రేట్లు తిరిగి సాధారణ స్థాయిలకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో సంతోషంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలు షాపింగ్ చేయాలని అనుకుంటున్నారు. అయితే దానికి ముందుగా తమ నగరాల్లోని తాజాగా తగ్గిన రేట్లను పరిశీలించటం బెటర్.
జూన్ 25న బంగారం రేట్లు తగ్గాయి. జూన్ 24 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.278 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.14వేల 013గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.12వేల 845గా కొనసాగుతోంది.
గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. జూన్ 25, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.10వేలు తగ్గింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 30వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.230 దగ్గర ఉంది.