
తిరుమలలో దళారీని నమ్మి 60 మంది భక్తులు మోసపోయారు. సుప్రభాత సేవ ఇప్పిస్తామని చెప్పి భక్తుల నుంచి భారీ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కొక్కరి నుంచి 6 వేల రూపాయలు వసూలు చేసి లక్షల్లో దోచుకున్నారు.
గుంటూరు, హైదరాబాదు, కర్ణాటక నుండి వచ్చిన భక్తులకు సుప్రభాత సేవ ఇప్పిస్తామని ఎర వేశారు దళారులు. ఒక్కొక్కరి నుంచి 6 వేల చొప్పున 60 మంది నుంచి మొత్తం3 లక్షల 60 వేలు వసూలు చేశారు. దళారులను నమ్మిన భక్తులు.. ఫోన్ ఫే ద్వారా డబ్బులు పంపారు.
►ALSO READ | తిరుపతిలో దొంగల బెడద..మొన్న రూ.20 లక్షలు.. నిన్న 1000 డాటర్లు..
టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖల పేరుతో సుప్రభాతం ఇప్పిస్తామని దళారి నిమ్మల శ్రీనివాస్ నమ్మించాడని బాధితులు తెలిపారు. తీరా డబ్బులు చేతికొచ్చాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. డబ్బులు తీసుకుని ఫోన్ స్విచాఫ్ చేయడంతో భక్తులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుల మేరకు విజిలెన్స్, పోలీసు అధికారులు విచారిస్తున్నారు.