
టీమిండియాకు ఆడడం అనేది ప్రతి క్రికెటర్ డ్రీమ్.. దీన్ని అచీవ్ చేయడానికి చాలా మందికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ వైభవ్ సూర్యవంశీ మాత్రం కేవలం 15 ఏళ్లకే తన కలని నిజం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో తన ఆటతీరుతో అందరిని ఆకర్షించిన వైభవ్..బీసీసీఐ సెలెక్టర్ మనసు గెలిచి 15 ఏళ్లకే ఇండియన్ టీమ్‌కు సెలెక్ట్ అయి అతి చిన్న వయస్సులోనే భారత జట్టుకు సెలెక్ట్ అయిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ చారిత్రాత్మక క్షణాన్ని ప్రతిబింబిస్తూ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో, టీమ్ ఇండియా ప్రముఖ త్రోడౌన్ స్పెషలిస్ట్ ‘రఘు’ చేతుల మీదుగా వైభవ్ తన తొలి అంతర్జాతీయ జెర్సీని అందుకున్నాడు. జెర్సీని అందుకున్న సూర్యవంశీ ఎమోషనల్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
కల నిజమైన వేళ.. బీసీసీఐ ప్రత్యేక వీడియో!
వైరల్ వీడియో ప్రకారం.. జెర్సీ అందుకున్న తర్వాత వైభవ్ సూర్యవంశీ తన ఆనందాన్ని అందరితో పంచుకున్నాడు..నేను మొదటిసారి చేతిలోకి బ్యాట్ పట్టుకుని, ప్రాక్టీస్ కోసం క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిన రోజు నుండి ఈ క్షణం కోసమే కలలు కన్నానని. ఈ రోజు నా కల నెరవేరిందని వైభవ్ చెప్పుకొచ్చాడు. ఇది నా ప్రయాణంలో అత్యంత కీలకమైన అడుగని చెప్పుకొచ్చాడు. ఈ అనుభూతిని నేను మాటల్లో వర్ణించలేను. ఇది ఒక అద్భుతమైన కలలా ఉంది, ఆ జెర్సీని చూడగానే నా ముఖంలో నవ్వు ఆపుకోలేకపోయాను అని వైభవ్ తన సంతోష్యాన్ని వ్యక్తి చేశాడు.
హోటల్ రూమ్‌లోకి జెర్సీ వచ్చినప్పుడు ఇదంతా నాకు ఓ కలలా అనిపించిది.. దీనికి ఎలా రికాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదని వైభవ్ అన్నాడు. కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని విషయాలు మన జీవితంలో జరుగుతాయి. అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా మనకు తెలియదు. జెర్సీ అందుకున్నప్పుడూ నా పరిస్థితి కూడా సేమ్ అలాగే ఉంది అని వైభవ్ చెప్పుకొచ్చాడు.
Ladies & Gentlemen
The moment the nation has been waiting for has arrived!
Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment
pic.twitter.com/sUUytFMPVw
— BCCI (@BCCI) June 23, 2026
రైనా, హర్భజన్ జెర్సీ నంబర్‌తో వైభవ్
అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో ‘నంబర్ 3’ జెర్సీని కేటాయించారు. గతంలో ఈ ప్రతిష్టాత్మక నంబర్ జెర్సీని భారత దిగ్గజాలు అయిన హర్భజన్ సింగ్, సురేష్ రైనా వంటి ప్లేయర్లు ధరించడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.