Reading Time: 2 minutes
Infinix Note 60 Pro Pininfarina Limited Edition Launched In India Price Features And Specifications Are

Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition: ప్రీమియం డిజైన్‌కు కొత్త అర్థం చెబుతూ ఇన్ఫినిక్స్ (Infinix) నుండి కొత్త “నోట్ 60 ప్రో పినినఫారినా లిమిటెడ్ ఎడిషన్ (NOTE 60 Pro Pininfarina Limited Edition)” స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఇటాలియన్ ఆటోమొబైల్ డిజైన్ సంస్థ పినినఫారినా (Pininfarina) తో కలిసి రూపొందించిన ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్, సూపర్‌ కార్‌ల నుంచి ప్రేరణ పొందిన ప్రత్యేక డిజైన్‌తో లాంచ్ అయ్యింది.

సూపర్‌కార్ స్టైల్ డిజైన్:

ఈ కొత్త మొబైల్లో “కార్బన్ ఫైబర్ ఫినిష్” డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. రేసింగ్ కార్లలో ఉపయోగించే హై-స్ట్రెంగ్త్ కార్బన్ కాంపోజిట్ లుక్‌ను ఫోన్ వెనుక భాగంలో అందించారు. 360 డిగ్రీల ఏరోస్పేస్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ఫోన్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఫోన్ సైడ్‌ల వెంట, కెమెరా మాడ్యూల్ చుట్టూ ప్రత్యేక రెడ్ యాక్సెంట్ లైన్స్‌ను జోడించారు. ఇవి లగ్జరీ స్పోర్ట్స్ కార్ల డిజైన్‌ను గుర్తు చేస్తాయి. అలాగే కెమెరా పక్కనే యాక్టివ్ మ్యాట్రిక్స్ రియర్ డిస్‌ప్లేను అందించారు. ఇందులో నోటిఫికేషన్లు, సమయం, బ్యాటరీ స్థాయి వంటి సమాచారం కనిపిస్తుంది.

ప్రీమియం అన్‌బాక్సింగ్ అనుభవం:

ఈ లిమిటెడ్ ఎడిషన్ ఫోన్‌తో పాటు ప్రత్యేక ప్రీమియం రిటైల్ ప్యాకేజింగ్‌ను కూడా అందిస్తున్నారు. బాక్స్‌లో 90W ఫాస్ట్ ఛార్జర్, బ్రెయిడెడ్ USB టైపు-C కేబుల్, MagPad వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, మాగ్నెటిక్ రింగ్‌తో కూడిన ట్రాన్స్‌పరెంట్ కేస్, ప్రత్యేక డిజైన్‌తో సిమ్ ఎజెక్టర్ టూల్ వంటి యాక్సెసరీస్ లభిస్తాయి.

ప్రీమియం స్పెసిఫికేషన్లు:

* Infinix NOTE 60 Pro Pininfarina Editionలో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2304Hz PWM డిమ్మింగ్, Gorilla Glass 7i రక్షణతో వస్తుంది.

* ఈ ఫోన్‌ Qualcomm Snapdragon 7s Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. 8GB LPDDR5X RAM, 256GB UFS 2.2 స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

* ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరాను అందించారు. ప్రధాన కెమెరాకు OIS (Optical Image Stabilization) సపోర్ట్ ఉంది. 4K వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

* ఈ ఫోన్‌లో 6500mAh భారీ బ్యాటరీని అందించారు. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 30W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, JBL ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు, Hi-Res Audio, NFC, IR సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

* 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 29 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్, ఇన్ఫినిక్స్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

* లాంచ్ ఆఫర్లలో భాగంగా HDFC బ్యాంకు, Axis బ్యాంకు, ICICI బ్యాంకు, SBI క్రెడిట్ కార్డులపై రూ. 2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. లేదా ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా అదనంగా రూ. 2,000 తగ్గింపు పొందవచ్చు.