Reading Time: < 1 minute
AP Cabinet : ఏపీలో వారందరికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక పాత విధానంలోనే పెన్షన్‌ల అమలు!

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో 2004 కంటే ముందు ఉద్యోగాల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానాన్ని (OPS) అమలు చేయాలని నిర్ణయించింది. తాజాగా వెలగపూడి సచివాలయంలో మంత్రులతో జరిగిన కేబినెట్‌ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రిటైర్మెంట్ సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగికి సగటున రూ.3 కోట్ల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.

అలాగే రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల స్థాపనకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమొదం తెలిపింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, ఐటీ, పర్యాటకం, రాజధాని అభివృద్ధి, డేటా సెంటర్లు ఏర్పాటు వంటి అనేక ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.SIPB ద్వారా ప్రతిపాదించిన మొత్తం రూ.34 వేల కోట్ల భారీ పెట్టుబడుల స్థాపననకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టుకు అందుబాటులోకి వస్తే సుమారు 35 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా సాయికృష్ణ వ్యవహారంపై మంత్రులతో చర్చించారు. సాయికృష్ణ కేసులో ప్రభుత్వం చేయాల్సిన ప్రతి చర్య తీసుకుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ అంశంపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్న సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రచారాన్ని మంత్రులంతా ఖండించాలని, కూటమి పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలని సూచించారు. సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం ఇప్పటికే సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతోందని సీఎం అన్నారు. ప్రభుత్వం లక్ష్యం నిష్పక్షపాత దర్యాప్తు మాత్రమేనని, మంత్రులంతా ఇదే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.