Reading Time: 2 minutes

లక్నో ప్రమాదం: భయ్యా.. 5 మంది బాత్ రూమ్లో లాకయ్యారు.. కన్నీళ్లు తెప్పిస్తున్న మృతుడి చివరి కాల్.. అసలేం జరిగింది..?

Caption of Image.

భయ్యా.. ఇన్ స్టిట్యూట్ మొత్తం అంటుకుంది. మేము లోపలే ఉన్నాము. బాత్ రూమ్ లో ఐదారుగురు చిక్కుకున్నారు.. ఇవి లక్నో కోచింగ్ సెంటర్ లో చనిపోయిన ఒక విద్యార్థి చివరి మాటలు. ప్రమాదం గురించి తన అన్నయ్యకు చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పించ మానవు. తీవ్ర విషాదాన్ని నింపిన ఉత్తరప్రదేశ్ లక్నో అగ్రి ప్రమాదం 15 మందిని బలిగొంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ కోచింగ్, గేమింగ్ సెంటర్ లో జరిగిన ప్రమాదంలో స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ చేసి ఆస్పత్రికి తరలించినా.. చికిత్స పొందుతూ విద్యార్థులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారు. 

సోమవారం (2026 జూన్ 22) లక్నో లోని అలీగంజ్ ఏరియాలో జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. ఉషా మెహతా మార్గ్ లోని.. పురానియా ఏరియాలో.. మూడు ఫ్లోర్ల బిల్డింగ్ లో ఈ ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు. మిగతా పైనున్న ఫ్లోర్లలో కోచింగ్ ఇన్ స్టిట్యూట్, యానిమేషన్ సెంటర్, గేమింగ్ సెంటర్స్ రన్ అవుతున్నాయి. 

15 మంది బలి:

ఈ ప్రమాదంలో 15 మది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బ్రజెష్ పాఠక్ చెప్పారు. మృతులంగా 20 నుంచి 24 ఏండ్లలోపు ఉన్న విద్యార్థులేనని తెలుస్తోంది. ఒక్కసారిగా బిల్డింగ్ అంతటా మంటలు వ్యాపించడంతో.. విద్యార్థులు వాష్ రూమ్స్ తో పాటు గదులలో మూలలకు నక్కిఉన్నారు. మంటల ధాటికి, పొగలు కమ్మేయడంతో ఊపిరాడక మంటల్లోనే మాడి మసై పోయారు. ఆ దృశ్యాలు హృదయవిదారకంగా గుండెలను పిండేసేలా ఉన్నాయి. హాస్పిటర్ పరిసర ప్రాంతాలు కుటుంబ సభ్యుల రోదనలతో నిండిపోయాయి. 

కన్నీళ్లు తెప్పిస్తున్న మృతుడి ఫోన్ కాల్:

ప్రమాదంలో చిక్కుకున్న ఒక విద్యార్థి వాళ్ల అన్నయ్యతో మాట్లాడిన కాల్ వింటే కన్నీళ్లు రాక మానవు. మంటల్లో చిక్కుకున్న తమ్ముడికి వెంటనే అన్న గుర్తుకొచ్చాడు. భయ్యా.. ఇన్ స్టిట్యూట్ మొత్తం అంటుకుంది. మేము లోపలే ఉన్నాము. బాత్ రూమ్ లో ఐదారుగురు చిక్కుకున్నారు.. అంటూ హృదయవిదారకంగా మాట్లాడినట్లు అతడి అన్న షకీల్ చెప్పాడు. బాత్ రూమ్ లో ఐదారుగురు ఉన్నారని చెప్పేలోపే కాల్ డిస్ కనెక్ట్ అయినట్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు షకీల్. ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణం ఎంత కొట్టుమిట్టాడిందోనని భావోద్వేగానికి గురయ్యాడు. 

ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం:

లక్నో ప్రమాదంపై ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 

అగ్ని ప్రమాదంలో బిల్డింగ్ అంతా పూర్తిగా కాలిపోయింది. మంటలు ఆర్పేందుకు ఫైర్ ఫైటర్స్ కు గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. NDRF, SDRF బలగాలు రంగంలోకి దిగాయి. ఘటనకు సంబంధించి కారణాలు ఇంకా తెలిసిరాలేదని అన్నారు. ఫైర్ యాక్సిడెంటే కారణం అయి ఉండొచ్చునని.. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెప్పారు. 

►ALSO READ | లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన విద్యార్థులు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

విద్యార్థులు హాల్ లో ఉండగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రాణాలు చేతిలో పెట్టుకుని విద్యార్థులు పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి దూకి గాయాలతో బయటపడ్డారు. నలుగురు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. మరికొందరు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. షాక్ సర్క్యూట్ అని భావిస్తున్నారు. 

ప్రమాద సమయంలో విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి దూకుతున్న విజువల్స్ భయానకంగా కనిపిస్తున్నాయి. మంటల సమయంలో పక్కన ఉన్న బిల్డింగులను ఖాళీ చేయించారు. 

ఇక్కడ లైబ్రరీ, కంప్యూటర్, గేమింగ్ ఇన్ స్టిట్యూట్లు ఉన్నాయి. అక్కడ పెద్దఎత్తున పొగలు వస్తుండటం చూసి ఐదు ఆరు మందిని కాపాడాము. మంటలకు తాళలేక ఒక వ్యక్తి ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకాడు. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.. అని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. 

©️ VIL Media Pvt Ltd.