
హర్రర్ సినిమాలకు , థ్రిల్లర్ జోనర్లకు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ ఉండే క్రేజ్ వేరు. ప్రస్తుతం థియేటర్లలో కంటే ఓటీటీ వేదికల పై ఇలాంటి భయానక చిత్రాలను చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, ప్రేక్షకులను వణికించేస్తున్న ఒక సూపర్ హిట్ హర్రర్ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన చూసి ఓటీటీ లవర్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమా కథాంశం , ఇందులో చూపించిన భయానక సన్నివేశాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. మనం మాట్లాడుకుంటున్న ఈ సినిమా పేరు ఖౌఫ్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది కేవలం జంప్ స్కేర్స్ (హఠాత్తుగా భయపెట్టే సీన్లు) మాత్రమే కాకుండా, కథలో ఉండే ఉత్కంఠత, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. చాలా కాలం తర్వాత ఒక పర్‌ఫెక్ట్ హర్రర్ ఎంటర్‌టైనర్ చూశామంటూ నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎమ్‌డీబీ (IMDb) లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రేటింగ్స్ దక్కడం విశేషం. సాధారణంగా హర్రర్ సినిమాలకు ఐఎమ్‌డీబీలో ఎక్కువ రేటింగ్ రావడం చాలా అరుదు, కానీ ఈ సినిమా ఆ రికార్డును తిరగరాసింది.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
అయితే, ఈ సినిమా చూసిన నెటిజన్లు , సినీ విమర్శకులు ఒక ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. ఈ సినిమాను రాత్రి పూట అస్సలు ఒంటరిగా చూడకండి అని గట్టిగా చెబుతున్నారు. ఇందులోని కొన్ని సీన్లు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, గుండె ధైర్యం ఉన్నవారు సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడటం ఖాయం. పగటిపూట లేదా ఇంట్లో అందరితో కలిసి చూడటం మంచిదని సలహా ఇస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
ఈ సినిమా కథ మొత్తం ఢిల్లీలోని ఓ బాలికల హాస్టల్‌లో జరిగే రహస్య ఘటనల చుట్టూ తిరుగుతుంది. ఆ హాస్టల్‌లోని 333 నంబర్ గది భయంకర సంఘటనలకి కేంద్రంగా ఉంటుంది. గ్వాలియర్ నుంచి ఢిల్లీకి చదువు కోసం వచ్చిన ఒక యువతి ఆ గదిలోకి మారుతుంది. అక్కడి అమ్మాయిలు ముందుగానే “ఆ గదిలో ఉండొద్దు” అని హెచ్చరిస్తారు. అయితే ఆమె వినకుండా అక్కడే ఉండిపోతుంది. ఆ తర్వాత ఆమె గదిలో విచిత్ర సంఘటనలు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఏ జరిగిందనేది సినిమా.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..