Reading Time: < 1 minute

మా ఊళ్లోకి ప్రైవేట్ స్కూల్‌‌‌‌‌‌‌‌ బస్సులు రావొద్దు: పంచాయతీలో తీర్మానం

Caption of Image.

నిజాంపేట, వెలుగు: ప్రభుత్వ స్కూల్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకోవడానికి మెదక్ జిల్లా నిజాంపేట మండలం శౌకత్‌‌‌‌‌‌‌‌పల్లి గ్రామస్తులు తమ ఊళ్లోకి ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌ బస్సులు, టీచర్లు రావొద్దని పంచాయతీలో తీర్మానం చేశారు. గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌లో 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు.

దీంతో గ్రామ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ సునీత.. పాలకవర్గంతో చర్చించి గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్‌‌‌‌‌‌‌‌ బస్సులు, ప్రైవేట్ టీచర్లు అడ్మిషన్‌‌‌‌‌‌‌‌ ప్రచారానికి రావొద్దని తీర్మానం చేశారు. ఈ మేరకు గ్రామానికి వెళ్లే రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అలాగే ఖాసీంపూర్ తండాలోకి ప్రైవేట్ స్కూల్​ బస్సులు రావొద్దని తండా వాసులు రోడ్డుపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

©️ VIL Media Pvt Ltd.