Reading Time: 2 minutes
పర్సెంటేజ్ పంచాయతీ.. 10 రోజులే డెడ్ లైన్..!

సింగిల్ స్క్రీన్స్‌లో పర్సెంటేజ్ ఇష్యూపై కమిటీ నిర్ణయించిన డెడ్ లైన్‌కు మరో 10 రోజులే టైమ్ ఉంది. మరి నిజంగానే జూన్ 30 తర్వాత తెలంగాణలోని థియేటర్స్‌లో పర్సెంటేజ్ విధానం వస్తుందా..? ఇప్పటికీ అదే మాటపై ఉన్నారా లేదంటే పెద్ది వరకే అది పరిమితమైందా..? మరో పెద్ద సినిమా వచ్చాకే ఇష్యూ రగిలిస్తారా లేదంటే డెడ్ లైన్ లోపే నిర్ణయం తీసుకుంటారా..? ఇదే ఈరోజు ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఆ మధ్య ఇండస్ట్రీలో బాగా నడిచిన పర్సెంటేజ్ పంచాయితీకి కొన్ని రోజులుగా బ్రేక్ పడింది. పెద్ది సినిమాకి ముందు చాలా పెద్ద ఇష్యూనే అయిందిది. చిరంజీవి జోక్యంతో ఈ వివాదం అప్పటికి సద్దుమణిగింది. పర్సెంటేజ్ ఇస్తేనే పెద్ది ఆడిస్తామని చెప్పిన ఎగ్జిబిటర్లు.. మనసు మార్చుకుని.. జూన్ 30 వరకు రెంటల్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి కమిటీ లెక్కల ప్రకారం తెలంగాణ, ఏపీలో టికెట్ రేట్లు పెంచితే రెంట్‌తో పాటుగా 7.5% ఎగ్జిబిటర్లకి చెల్లించాల్సి ఉంటుంది. చిన్న సినిమాలకు రేట్లు పెంచేది లేదని.. పెద్ద సినిమాలకు పెరిగిన రేట్లలో పర్సెంటేజ్ తీసుకుంటామని చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలను పర్సంటేజీ విధానంలో ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ డెడ్ లైన్‌కు మరో 10 రోజులే ఉందిప్పుడు. మే 25న చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించిన తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌కు మెగా భరోసా లభించింది. ఛాంబర్ ప్రత్యేక కమిటీ నివేదికకు అనుగుణంగా నడుచుకోవాలని ఎగ్జిబిటర్లకు సూచించారు చిరు. జూన్ 30 తర్వాత ఆమోదయోగ్యమైన నిర్ణయాలు వస్తాయని ఎగ్జిబిటర్లు తెలిపారు. దాంతో జూలై 1 నుంచి విడుదల కాబోయే సినిమాల పరిస్థితేంటి అనే కొత్త చర్చ మొదలైంది. అప్పటికి సమస్యలన్నీ తొలిగిపోవడంతో పెద్ది బాగానే విడుదలైంది.. గత 20 రోజులుగా వచ్చిన సినిమాలకు సమస్యలేం లేవు. కానీ జూలై 3న నాగబంధంతో పాటు రావ్ బహదూర్ రానున్నాయి. వీటికి పర్సెంటేజ్ ఇస్తారా లేదా రెంటల్ విధానంతో ఎగ్జిబిటర్లు వెళ్తారా అనేది చూడాలి. పెద్ది లాంటి పెద్ద సినిమా రావాలంటే ఇంకా చాలా టైమ్ ఉంది. ఆలోపు ఎగ్జిబిటర్లు, నిర్మాతల మనసు ఎలా మారుతుందో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖాళీగా ఓలా.. అయినా ఉబర్‌ కోసం అరగంట వెయిటింగ్‌! బెంగళూరులో వింత ఘటన

11 ఏళ్లకే యూకే యూత్ పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డ్‌.. వైజాగ్ టు లండన్ కలశ నాయుడు ప్రయాణం

ఉద్యోగితో రూ. 2.5 లక్షల ఫిట్‌నెస్ బెట్ లో ఓడిన జెరోదా బాస్

ఫోన్‌ దొంగిలించి పారిపోతూ కుప్పకూలిన దొంగ.. క్షణాల్లో ప్రాణాలు గాల్లో..

వీడు మామూలోడు కాదు.. పగలు ఇళ్లకు రంగులు.. రాత్రయితే చాలు..