
టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ మా ఇంటి బంగారం ‘ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సక్సెస్‌తో చిత్ర బృందం ఫుల్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలోనే సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు, టీమ్ అంతా కలిసి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. చిరు, ఆయన సతీమణి సురేఖ సామ్‌కు చీర ప్రెజెంట్ చేసి, పూలబొక్కేతో గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు.
చిరు క్రేజీ ట్వీట్..
ఈ సంతోషకరమైన సందర్భాన్ని మెగాస్టార్ తన స్టైల్లో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరా అవుతోంది. ‘మా ఇంటి బంగారం’ సినిమా చూశాను, చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఒక ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ, నందిని రెడ్డి తనదైన శైలిలో సినిమాను ఎంతో వినోదాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా చీరకట్టులో సమంత చేసిన యాక్షన్ సీన్స్ థియేటర్లలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.
తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి వైవిధ్యమైన, ఉమెన్-సెంట్రిక్ సినిమాలు ఎంతో అవసరం. ఈ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సమంత, నందిని రెడ్డి, రాజ్ , చిత్ర యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు. అట్లే.. ‘జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న సమంత, రాజ్ దంపతులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు’ అంటూ చిరు క్లాసిక్ లీక్ ఇచ్చేసారు. దీంతో సమంత త్వరలోనే తల్లి కాబోతుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయరు.
ALSO READ : డబ్బు కోసం 10 మంది భర్తలను అయినా మారుస్తా
Thank you, Megastar @KChiruTweets Garu ❤️
Your appreciation for #MaaIntiBangaaram means the world to me and my team. It still feels surreal to receive such kind words from you.
So happy that you loved the film ✨ https://t.co/5c58VufEos
— Samantha (@Samanthaprabhu2) June 23, 2026
సమంత బేబీ బంప్..
గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్‌లో సమంత బేబీ బంప్‌ను గమనించిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. దానికి తగ్గట్టే డైరెక్టర్ నందిని రెడ్డి కూడా సినిమా హిట్ అయిన క్రమంలోనే సమంత లైఫ్‌లోకి ఇంతటి మధురమైన క్షణాలు రావడం సంతోషంగా ఉంది అని కన్ఫర్మ్ చేసేశారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా అఫీషియల్‌గా విష్ చేయడంతో సామ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ప్రొఫెషనల్ లైఫ్‌లో బ్లాక్‌బస్టర్ సక్సెస్, పర్సనల్ లైఫ్‌లో ప్రెగ్నెన్సీ.. ఇలా సమంత ప్రస్తుతం తన లైఫ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది సూపర్ ఉమెన్ అంటూ సామ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నారు ఫ్యాన్స్ , నెటిజన్లు.
🚨Director B.V. Nandini Reddy has reportedly announced that #Samantha is pregnant 😱
With her recent film #MaaIntiBangaram receiving a great response, this happy news in her personal life has made the moment even more special for Samantha ❤️
Congratulations to Sam and Raj pic.twitter.com/i6fsN245Ko
— Sekar 𝕏 (@itzSekar) June 23, 2026