ప్రయాణీకుల భద్రతను, ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ తాజాగా రైల్వే మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. రైల్వే యాక్ట్ 2026 కింద 1989లోని పలు సెక్షన్లకు సవరించిన రైల్వే శాఖ ఈ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం.. ఇకపై ట్రైన్లో కానీ, రైల్వే స్టేషన్ పరిసరాల్లో కాని ఎవరైనా ధూమపానం చేసినా, అక్రమ అమ్మకాలు, భిక్షాటన వంటి కార్యకలాపాలపై పాల్పడితే రూ.2,000 జరిమానా విధించనున్నట్టు స్పస్టం చేసింది.
ధూమపానంపై కఠిన చర్యలు: రైల్వే చట్టంలోని సెక్షన్ 167 ప్రకారం రైలు లేదా రైల్వే ప్రాంగణంలో పొగతాగడం నిషేధం. గతంలో ఈ తప్పుకు రూ.100 జరిమానా ఉండేది కానీ తాజా మార్పులు తర్వాత దీనికి రూ.2,000కి పెంచారు. అంతేకాదు సదరు ప్రయాణికుడి టికెట్‌ను జప్తు ట్రైన్ నుంచి దించేసే అవకావం కూడా ఉంది. ఒకవేళ అక్కడికక్కడే మీరు జరిమానా కట్టకపోలే.. మిమ్మల్ని కోర్టులో ప్రవేశ పెడతారు. కానీ అక్కడ మీ జరిమానా మరింత పెరుగుతుంది. కోర్టులో మీరు రూ.5,000 వరకు ఫైన్ కట్టాల్సి వస్తోంది.
అక్రమంగా అమ్మకాలు, భిక్షాటనపై : రైల్వే చట్టంలోని సెక్షన్ 144 ప్రకారం, లైసెన్సు లేకుండా సరుకులు అమ్మడం, భిక్షాటన చేయడం నేరం. ఇందుకు గానూ రైల్వే శాఖ కొత్త నిబంధనల ప్రకారం రూ. 2,000 వరకు ఫైన్ పడవచ్చు. ఇది కూడా సేమ్.. మీరు వెంటనే ఫైన్ కట్టకపోతే.. కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ మీకు రూ.5వేల ఫైన్‌తో పాటు 3 నెలల జైలు శిక్ష కూడా పడే ఛాన్స్ ఉంటుంది.
టికెట్ లేని ప్రయాణం: అయితే టికెట్ లేకుండా అక్రమంగా ట్రైన్లో ప్రయాణించే అంశంపై కూడా జరిమానా పెంచాలని రైల్వే శాఖ చూస్తోంది.ప్రతిపాదన ప్రకారం, టికెట్ లేకుండా ప్రయాణించే వారికి రూ. 250 నుండి రూ. 500కు వరుకు ఫైన్ వేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వేరే వాళ్ల టికెట్‌పై ప్రయాణించినా కూడా ఈ జరిమానకు మీరు అర్హులు అవుతారు.
మహిళల కోచ్‌లలో ప్రయాణిస్తే: రైల్వే శాఖ కొత్త రూల్స్ ప్రకారం.. ఎవరైనా పురుషులు ట్రైన్లో మహిళల కోసం కేటాయించిన కోచ్‌లలో ప్రయాణిస్తే వారికి రూ. 2,500 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మహిళా ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది.




