Reading Time: 2 minutes

2 వేల ఫోన్ కాల్స్.. 238 గంటల డిస్కషన్స్: కాబోయే భర్తను లేపేసేందుకు ప్రియుడితో కలిసి యువతి స్కెచ్..!

Caption of Image.

6 నెలల్లో 2 వేల ఫోన్ కాల్స్.. 238 గంటల డిస్కషన్స్.. కాబోయే భర్తను లేపేసేందుకు ప్రియుడితో కలిసి ఫోన్‎లో యువతి భారీ స్కెచ్ వేసింది. పెళ్లి ఇష్టం లేకపోవడంతో కాబోయే భర్తను ప్రిప్లాన్డ్‎గా హత్య చేసేందుకు ప్రియుడుతో ఫోన్‎లో గంటల తరబడి చర్చించింది. చివరకు ప్లాన్ ప్రకారం కాబోయే భర్తను కోట నుంచి నూకేసి.. కాలు జారి చనిపోయడంటూ ఓ పిట్ట కథ అల్లింది. కానీ పోలీసులు తమదైన శైలీలో విచారణ చేయడంతో మైండ్ బ్లోయింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న కేతన్ అగర్వాల్, సియా గోయల్, చేతన్ చౌదరిల ఉదంతానికి సంబంధించిన స్టోరీ ఇది. 

అసలేం జరిగింది..?

పూణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కొడుకు కేతన్ అగర్వాల్ (26)కు సియా గోయల్ అనే యువతితో అతని పెళ్లి జరగాల్సి ఉంది. రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా పెళ్లి పనులు కూడా మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే జూన్ 18న కేతన్ తన కాబోయే భార్య, స్నేహితులతో కలిసి లోహగడ్ కోటకు ట్రెక్కింగ్‎కు వెళ్లాడు. 

అక్కడ ఫోటోలు దిగుతుండగా బలమైన గాలుల వల్ల కేతన్ కాలుజారి 400 అడుగుల లోయలో పడిపోయాడని సియా గోయల్ పోలీసులకు చెప్పింది. పోలీసులు కూడా దీన్ని ప్రమాదంగానే భావించారు. అయితే, కేతన్ మరణంపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో విచారించగా భయంకరమైన నిజం బయటపడింది. 

కేతన్‎తో పెళ్లి ఇష్టం లేని సియా ఆమె ప్రియుడు చేతన్‎తో కలిసి కాబోయే భర్తను హత్య చేసిందని పోలీసులు నిర్ధారించారు. డిజిటల్ విచారణలో భాగంగా పోలీసులు సియా, ఆమె ప్రియుడు చేతన్ ఫోన్ కాల్ డేటా రికార్డులను (CDR) పరిశీలించగా.. గత ఆరు నెలల్లో వీరి మధ్య 2,004 ఫోన్ కాల్స్ జరిగాయని, వారు ఏకంగా 238 గంటల పాటు మాట్లాడుకున్నారని నిర్ధారణ అయ్యింది. ఈ కాల్ డేటా ఆధారంగానే పోలీసులు ఈ ఘోర హత్య కుట్రను ఛేదించారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన కేతన్ పాడె ఎక్కగా.. సియా, ఆమె ప్రియుడు కేతన్ ఊచలు లెక్కబెడుతున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.