
మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఈసీఓఎన్) ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ స్వీకరణ ప్రక్రియ ఏప్రిల్ 27న ప్రారంభమై మే 11న ముగుస్తుంది.
మొత్తం ఖాళీలు: 103.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తి చేసి, పని అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 50 ఏళ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 27.
లాస్ట్ డేట్: మే 11.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ meconlimited.co.inను సందర్శించండి.