
కౌడిపల్లి, వెలుగు: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని ఎస్సీ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ గద్దెను ధ్వంసం చేయడం స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ లీడర్లు జెండా గద్దె వద్దకు వెళ్లారు. అప్పటికే గద్దె ధ్వంసమై కనిపించింది. ఈ ఘటనను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు రామగౌడ్ మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే పార్టీ జెండా గద్దెను కూలకొట్టారని ఆరోపించారు. కాగా అదే కాలనీకి చెందిన ముగ్గురు గద్దెను ధ్వంసం చేసిన్టలు తెలిసింది.
తొగుట (దుబ్బాక), వెలుగు: బీఆర్ఎస్సే తెలంగాణకు రక్ష అని దుబ్బాక బీఆర్‌ఎస్ లీడర్లు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు .