Reading Time: < 1 minute

అధైర్యపడొద్దు ఆదుకుంటాం : ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

Caption of Image.

మొగుళ్లపల్లి, వెలుగు: రైతులు అధైర్యపడొద్దని, పరిహారం ఇప్పించి ఆదుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి శివారులో ప్రమాదవశాత్తు దాదాపు 12 మంది రైతులకు చెందిన 20 ఎకరాల పైన మొక్కజొన్న పంట కాలి బూడిదైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

ఈ విషయాన్ని  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, విద్యుత్ శాఖ సీఎండీ, కలెక్టర్ రాహుల్ శర్మ దృష్టికి ఎమ్మెల్యే ఫోన్​ద్వారా చెప్పారు. నష్టపోయిన రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. విద్యుత్ శాఖ ఆఫీసర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.