Reading Time: < 1 minute

రాంచరణ్ అభిమానుల ఉత్కంఠకు తెర.. పెద్ది రిలీజ్ డేట్ చెప్పేసిన బుచ్చిబాబు

Caption of Image.

‘పెద్ది’ విడుదల తేదీపై రాంచరణ్ అభిమానుల్లో నెలకొన్న ఉత్కంఠకు దర్శకుడు బుచ్చిబాబు తెరదించాడు. ధనుష్ ‘కర’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు అటెండ్ అయిన బుచ్చిబాబు జూన్ 25న ‘పెద్ది’ సినిమా థియేటర్లలో సందడి చేయనుందని చెప్పేశాడు. ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ షూట్ నుంచి నేరుగా ‘కర’ ఈవెంట్కు వచ్చినట్లు బుచ్చిబాబు చెప్పాడు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ ఇప్పటికే ఆల్ మోస్ట్ అయిపోయింది. ఒక్క స్పెషల్ సాంగ్ మాత్రమే మిగిలి ఉంది.

అయితే.. పెండింగ్ పడిన ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ఆదివారం మొదలైంది. రాంచరణ్, శృతిహాసన్ మీద జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో 4 నుంచి 5 రోజుల పాటు ఈ సాంగ్ షూట్ జరగనుంది. ఈ పాట చిత్రీకరణ పూర్తయితే ఏప్రిల్ 30న ‘పెద్ది’ సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుంది.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ మారిన సంగతి తెలిసిందే.  ఏప్రిల్ 30న ఈ సినిమా విడుదల కావల్సి ఉంది.  అయితే జూన్‌‌ 25న విడుదల చేయబోతున్నట్టు బుచ్చిబాబు ప్రకటించాడు. ప్రేక్షకులకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతోనే వాయిదా వేసినట్లు ఇప్పటికే చెప్పాడు. అవుట్‌‌పుట్‌‌పై పూర్తి సంతృప్తిగా ఉన్నామని, అయితే సాంకేతికంగా ఇంకాస్త పర్ఫెక్షన్ కోసం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరికొంత సమయం కేటాయించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ పాన్- ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో శివ రాజ్‌‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.