Reading Time: < 1 minute

నో రెజ్యూమె.. 10 నిమిషాలు మాట్లాడి సెలెక్ట్ చేస్తారు.. బెంగళూర్ కంపెనీ హైరింగ్ విధానం వైరల్

Caption of Image.

జాబ్ ఏదైనా.. రెజ్యూమె లేకుండా దాదాపు ఏ ఇంటర్వ్యూ ఉండదు. ఉద్యోగంలోకి తీసుకునే ముందు సీవీ చూసి అందులో ఉన్న డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియెన్స్.. మొదలైన అంశాలు పరిగణనలోకి తీసుకుని క్యాండెట్ ను సెలెక్ట్ చేస్తుంటారు కదా. కానీ ఈ కంపెనీ ఫౌండర్ మాత్రం కాస్త డిఫరెంట్. రెజ్యూమ్ చూసి ఒక్కరిని కూడా హైర్ చేసుకోలేదని చెప్తున్నారు. ఈ పద్ధతి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో డిబేట్ నడుస్తోంది. 

ఈజ్మైఎక్స్పో ఫౌండర్ విక్రమాదిత్య శుక్లా .. రెజ్యూమె లేకుండా ఇంటర్వ్యూ చేసే విధానంతో ఫేమస్ అయ్యారు. క్యాండిడేట్ ఎక్స్ పీరియెన్స్ బేస్ చేసుకుని.. రిస్ట్రిక్టెడ్ క్లోజ్డ్ రూమ్లో చేసే హైరింగ్ విధానం తనకు నచ్చదని చెబుతున్నారు. 

ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 10 నుంచి 15 నిమిషాల అన్ స్ట్రక్చర్డ్ కన్వర్జేషన్స్ ద్వారానే క్యాండెట్ ను సెలెక్ట్ చేసుకుంటాడట. దీని కోసం ముందుగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేయడం లాంటిది ఏదీ ఉండదు. డైరెక్ట్ గా ఆ సమయంలో ఆ ఫ్లోలో జరిగే సంభాషణలోనే క్యాండిడేట్ ను డిసైడ్ చేసుకుంటాడట. 

నేనెప్పుడూ రెజ్యూమె ఆధారంగా ఎంప్లాయ్స్ ను తీసుకోలేదు. కంపెనీకి ఎవరైనా ఇంటర్వ్యూ కోసం వస్తే.. 10 -15 నిమిషాలు మాట్లాడుతూ స్పెండ్ చేస్తా. అందుకోసం స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ అంటూ ఉండవు. దీనికోసం ఎలాంటి ఫ్రేమ్ వర్క్ ఉండదు. నా ఎక్స్ పెక్టేషన్స్ కు మ్యాచ్ అయితే సెలెక్ట్ చేసుకుంటా అంటూ ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ వైరల్ గా మారింది. అయితే దీనికి స్కేలబులిటీ, ఆబ్జెక్టివిటీ గురించి చాలా మంది యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెషనల్ ఎక్స్ పీరియెన్స్ ను ఇగ్నోర్ చేసినట్లేనని అంటున్నారు. కానీ కొందరు ఈ విధానం బాగుందని అభినందిస్తున్నారు. స్టార్టప్ సెట్టింగ్స్ లో ఒక వ్యక్తి పర్సనాలిటీని జడ్జ్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుందని కామెంట్స్ చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.