
- టైటిల్: జెరాక్స్
- ప్లాట్ ఫాం : జీ5
- డైరెక్షన్ : శ్రీనిధి బెంగళూరు
- కాస్ట్ : నాగభూషణ్, పాయల్ చెంగప్ప, మంజు పావగడ, ఓం ప్రకాశ్ రావు, శ్రీవత్స, యశ్వంత్ శెట్టి
ప్రకాశ్(నాగభూషణ్) ఒక అనాథ. తన మామయ్య (ఓం ప్రకాశ్ రావు) దగ్గర పెరుగుతాడు. అతను రాయదుర్గం అనే చిన్న టౌన్‌లో ఒక జిరాక్స్ షాప్‌ను నడుపుతుంటాడు. ప్రకాశ్ కూడా అతనికి సాయంగా ఉంటాడు. ఆ షాప్‌లో ఉన్న పాత జిరాక్స్ మెషిన్ పదే పదే పాడవుతూ ఉంటుంది. ఒకరోజు రాత్రి ప్రకాశ్ తన గర్ల్‌ఫ్రెండ్ సూజీ (పాయాల్ చెంగప్ప)తో మాట్లాడి తిరిగి షాప్‌కు చేరుకుంటాడు. అదే టైంలో జిరాక్స్ మెషిన్ పని చేయడం ఆగిపోతుంది.
అప్పుడే వాళ్ల మామయ్య షాప్ నుంచి వెళ్లిపోతూ అతని ఐడీ కార్డ్ మెషిన్‌లో పెట్టి మర్చిపోతాడు. ఆ తర్వాత ప్రకాశ్ మెషిన్‌ని బాగుచేసి ఆన్ చేయగానే దానినుంచి వాళ్ల మామయ్య వస్తాడు. అంటే ఆ మెషిన్ మనుషులను కూడా డూప్లికేట్ చేయగలిగే సూపర్ పవర్‌గా మారిందని తెలుసుకుంటాడు. ఆ పవర్‌తో ప్రకాశ్ ఏం చేశాడు? తెలియాలంటే ఈ వెబ్‌సిరీస్ చూడాలి.