Reading Time: < 1 minute

మే 10న రాష్ట్రానికి మోదీ..మూడోసారి పీఎం అయ్యాక తొలిసారి తెలంగాణకు రాక

Caption of Image.
  •     పరేడ్ గ్రౌండ్స్​లో భారీ బహిరంగ సభకు ప్లాన్
  •     సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓపెనింగ్ 

హైదరాబాద్, వెలుగు: దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణకు రానున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఆయన వచ్చే నెల 10న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ  సందర్భంగా రాష్ట్రంలో రూ.7,500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ములుగు జిల్లాలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసే చాన్స్ ఉంది. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్​ట్రెయిన్​పొడిగింపు పనులకు, వరంగల్​మామునూరు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌పోర్టు అభివృద్ధి పనులకు కూడా ఆయన భూమిపూజ చేసే అవకాశం ఉందని సమాచారం. వీటితో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొదటి దశ పనులు దాదాపు పూర్తికావొచ్చాయి. ప్రధాని తన పర్యటనలో ఈ పనులను ప్రారంభించి జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. బీబీనగర్ ఎయిమ్స్, కాజీపేట వర్క్ స్టేషన్ తదితర వాటినీ ప్రారంభించే చాన్స్​ ఉంది. 

పరేడ్ గ్రౌండ్స్​లో భారీ బహిరంగ సభ

ప్రధాని రాక సందర్భంగా లక్ష మందితో పరేడ్ గ్రౌండ్స్​ లో సభ పెట్టేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.  మోదీ సభకు జెన్​జీతో పాటు స్ట్రీట్ వెండర్స్, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, మహిళలు ఎక్కువ గా హాజరయ్యేలా వ్యూహ రచన చేస్తున్నారు. సభకు జీహెచ్​ఎంసీ పరిధిలోని ఒక్కో డివిజన్ నుంచి 1500 మంది తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.    
 

©️ VIL Media Pvt Ltd.