
- ఫైనల్‌కు హాజరుకానున్న మంత్రి వివేక్
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్స్టేడియంలో ఆదివారం నుంచి జరుగనున్న అస్మితా ఖేలో ఇండియా ఫుట్ బాల్ లీగ్ఛాంపియన్షిప్-2026 స్టేట్‌లెవల్ పోటీలకు సర్వం సిద్ధమైంది. డీసీసీ ప్రెసిడెంట్, ఉమ్మడి ఆదిలాబాద్ ఫుట్బాల్అసోసియేషన్ బాధ్యుడు పిన్నింటి రాఘునాథ్‌రెడ్డి నేతృత్వంలో ఫుట్బాల్అసోసియేషన్, లెవన్స్టార్ పీకేఆర్క్లబ్, సింగరేణి యాజమాన్యం, దాతల సహకారంతో జరిగే ఈ అండర్-16 బాలికల పోటీలు నాలుగు రోజుల సాగనున్నాయి. పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు తలపడనున్నారు.
పోటీలను సక్సెస్చేయాలని రఘునాథ్రెడ్డితోపాటు నిర్వాహకులు పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్‌గౌడ్ కోరారు. స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అన్ని జిల్లాలకు చెందిన 180 క్రీడాకారులు హాజరవుతున్నారని, ఈనెల 29న జరిగే ఫైనల్‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి చీఫ్‌గెస్ట్‌గా వస్తున్నట్లు తెలిపారు.