Reading Time: < 1 minute

పశ్చిమ బెంగాల్ లో తొలిదశ పోలింగ్ ..ముర్షిదాబాద్ లో నాటు బాంబుల దాడి.. పలువురికి గాయాలు

Caption of Image.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశలో గురువారం(ఏప్రిల్23) 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ సాగుతోంది. పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ట ఘర్షణ తలెత్తాయి. ముర్షిదాబాద్ లో నౌదాలో ఓ పోలింగ్ కేంద్రం దగ్గర  గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులతో దాడి చేశారు. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఈఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన జరిగిన తర్వాత, నిరంతర హింసాత్మక ఘటనలతో అట్టుడికిపోతున్న ముర్షిదాబాద్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముర్షిదాబాద్ జిల్లాను ఎన్నికల సంఘం నిఘాలో ఉంచింది. 

రాష్ట్రంలో పోలింగ్ రెండు దశల్లో జరగునుండగా..తొలిదశలో ఉత్తర బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాల్లోని మొత్తం 54 నియోజకవర్గాలతో పాటు ముర్షిదాబాద్, నాడియా, బీర్భూమ్ ,హుగ్లీ జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో ఓట్లరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో నాలుగోసారి  తిరిగి అధికారంలోకి రావాలని మమతా బెనర్జీ.. తొలిసారి బెంగాల్ లోప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తోంది. దక్షిణ బెంగాల్‌లో బెనర్జీకి ఉన్న పట్టును ఎదుర్కొనేందుకు మొదటి దశ బిజెపికి ఒక ఉత్తమ అవకాశం కానుంది. 2021లో జరిగిన గత ఎన్నికలలో ఈ 152 స్థానాలలో 59 స్థానాలను బీజేపీపార్టీ గెలుచుకుంది.

ఇక ఈ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో 3.60 కోట్లకు పైగా ఓటర్లు ఉండగా.. అందులో 1.75 కోట్ల మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భద్రతకోసం భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) 2వేల450 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించింది ,8,000కు పైగా పోలింగ్ కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి భారీ భద్రతా ఏర్పాట్ల చేసింది. 

©️ VIL Media Pvt Ltd.