
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ జట్టుకి లక్నో బిగ్ షాక్ ఇచ్చింది. క్రీజులోకి వచ్చిన ఆర్ఆర్ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్– వైభవ్ సూర్యవంశీ ధాటిగా ఆడే క్రమంలో ఫస్ట్ వికెట్ కి 32 పరుగులు జోడించిన తర్వాత మహమ్మద్ షమీ బౌలింగ్ (2.5 ఓవర్లో)లో భారీ షాట్ ఆడబోయి కీపర్ రిషభ్ పంత్ కి క్యాచ్ ఇచ్చి జైస్వాల్ (12 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు) పెవిలియన్ కి చేరుకున్నాడు.
అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ఇలా వచ్చి అలా మహమ్మద్ షమీ బౌలింగ్ (2.6 ఓవర్లో) ధృవ్ జురెల్(0) కీపర్ పంత్ కి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్ గా మైదానం వీడాడు. ఆ తర్వాత ఓవర్ వేసిన మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన బంతులతో యంగ్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయడంతో పాటు చివరి బంతి (3.6 ఓవర్లో)కి భారీ షాట్ ఆబోయి దిగ్వేశ్ రాఠీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కి వెళ్లాడు సూర్యవంశీ. వికెట్ తో పాటు ఈ ఓవర్ మెడిన్ కూడా అయిపోయింది.
Also Read : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న లక్నో
కాగా, 32 పరుగుల వద్ద కీలకమైన మూడు వికెట్లని రాజస్థాన్ రాయల్స్ కోల్పోయింది. దీంతో జట్టుని ఆదుకునేందుకు ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్‌మయర్ బరిలోకి దిగారు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ, స్కోర్ బోర్డుని ముందుకు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో పవర్ ప్లే ముగిసే సమయానికి రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల నష్టానికి 54 పరుగులు పూర్తి చేసుకుంది. ఇక లక్నో బౌలర్లలో మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, మొహ్సిన్ ఖాన్ మెడిన్ ఓవర్ తో పాటు వికెట్ పడగొట్టాడు.
Mohsin Khan into the act now 🍿
He picks the in-form Vaibhav Sooryavanshi 🙌#RR 54/3 after 7 overs
Updates ▶️ https://t.co/5SaPY8wfsc#TATAIPL | #KhelBindaas | #LSGvRR pic.twitter.com/dESOyQx6va
— IndianPremierLeague (@IPL) April 22, 2026