Reading Time: 2 minutes

థాయ్‌లాండ్ వీధుల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ గ్యాంగ్.. తరుణ్ భాస్కర్ డబుల్ ధమాకా అదిరిపోయిందిగా!

Caption of Image.

నటుడు, యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మ్యాజిక్‌ను మళ్ళీ రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవైపు నటుడిగా బిజీగా ఉంటూనే, మరోవైపు మెగా ఫోన్ పట్టి తన మార్క్ కామెడీతో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE)  సినిమాకు సీక్వెల్ అప్డేట్ అందించారు. సోషల్ మీడియా వేదికగా’ENE Repeat’ పేరుతో  వస్తున్న ఈ మూవీ ఫోటోను తరుణ్ భాస్కర్  షేర్ చేశారు. ఇది నెట్టింట వైరల్ అవుతోంది. 

థాయ్‌లాండ్ వీధుల్లో గ్యాంగ్!

తెలుగు చిత్రసీమలో ‘ఈ నగరానికి ఏమైంది’ (ENE) ఒక కల్ట్ క్లాసిక్. ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్న అభిమానులకు తరుణ్ భాస్కర్ తీపి కబురు అందించారు. ‘ENE Repeat’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో శరవేగంగా జరుగుతోంది. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఒరిజినల్ గ్యాంగ్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి పాత జ్ఞాపకాలను గుర్తుచేశారు. ఆ ఫోటో చూస్తుంటేనే మళ్ళీ అదే వైబ్, అంతకు మించిన ఫన్ ఉండబోతుందని అర్థమవుతోంది.

 

నటుడిగా ‘గాయపడ్డ సింహం’ గర్జన

దర్శకత్వం పక్కన పెడితే, తరుణ్ భాస్కర్ నటుడిగానూ తన సత్తా చాటుతున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రం మే 1, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటివరకు కామెడీ పాత్రల్లో చూసిన తరుణ్‌ను ఈ సినిమాలో సరికొత్త రగ్గడ్ లుక్‌లో చూడబోతున్నాం. మే డే కానుకగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

రిలీజ్ ఎప్పుడు?

 ‘ENE Repeat’లో ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు దర్శకుడు అనుదీప్ కేవీతో పాటు మరికొంత మంది ప్రముఖులు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తున్నారు. ఒరిజినల్ పార్ట్ విజయంలో మ్యూజిక్ ఎంత కీ రోల్ పోషించిందో మనందరికీ తెలిసిందే. ఎస్ఎస్ ఒరిజినల్స్ , సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

►ALSO READ | Ramcharan: మిగిలింది 6 రోజులే.. రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సెల్ఫీ.. ‘పెద్ది’ రిలీజ్ ఎప్పుడంటే?

మొత్తానికి తరుణ్ భాస్కర్ తన నటనతో మే నెలలో, తన దర్శకత్వంతో దసరా సీజన్‌లో ప్రేక్షకులను ఖుషీ చేయడానికి పక్కా ప్లాన్‌తో ఉన్నారు. ఆ ‘గ్యాంగ్’ మళ్ళీ థియేటర్లలో చేసే రచ్చ చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి. 

 

©️ VIL Media Pvt Ltd.