
కేరళలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో 8 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( ఏప్రిల్ 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని ముండతికోడ్ లో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు జరిగిన సమయంలో షెడ్డులో సుమారు 40 మంది ఉన్నారని అనుమానిస్తున్నారు, వారిలో చాలా మందికి తీవ్ర గాయాలవ్వగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 26న జరగనున్న త్రిస్సూర్ పూరం సందర్భంగా, ఒక ఆలయం తరపున టపాసులు తయారు చేస్తున్న షెడ్డులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా…ఐదు మృతదేహాలను వెలికితీశామని.. మరో ముగ్గురి శరీర భాగాలు ఘటనాస్థలంలో లభించాయని తెలిపారు అధికారులు.
►ALSO READ | బైక్పై హైవే మీద రయ్ రయ్మని దూసుకెళ్లిన అన్నదమ్ములు.. ముగ్గురూ స్పాట్ డెడ్ !
ఈ ఘటన పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు కేరళ సీఎం పినరయి విజయన్. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని… విపత్తు నివారణ బృందాలు, పోలీసులు, ఫైర్ సిబ్బంది సమన్వయంతో పని చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.