
మలయాళం నుంచి మరో సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. స్టార్ నటుడు జయరాం, ఆయన కుమారుడు కాళిదాస్ జయరాం ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘అశకల్ ఆయిరం’ (Aashakal Aayiram). ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఏప్రిల్ 17, 2026న ఓటీటీలోకి వచ్చి ఆకట్టుకుంటోంది. జీ5లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ప్రస్తుతం మళయాళంతో పాటుగా తమిళ భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే తెలుగు ఆడియన్స్ ముందుకు రానున్నట్లు సమాచారం.
జి. ప్రజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తండ్రి-కొడుకు మధ్య ఉండే భావోద్వేగభరితమైన సంబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది. నిజజీవితంలో తండ్రికొడుకులైన జయరామ్-కాళిదాస్.. ఇందులోనూ అవే పాత్రలతో ఆకట్టుకున్నారు. జీవితం పట్ల విభిన్న దృక్పథాలు కలిగిన ఈ ఇద్దరి మధ్య కథ సాగుతుంది.
సినిమా స్టార్ కావాలనే పెద్ద కలలతో ముందుకు సాగుతున్న కొడుకు, మరోవైపు ఎన్నో కష్టాలు చూసి అలసిపోయిన తండ్రి. ఇద్దరూ ఒకరికొకరు మంచిదే కావాలని కోరుకున్నప్పటికీ, వారి ఆలోచనా విధానాల్లో ఉన్న తేడాలు తరచూ ఘర్షణలకు దారితీస్తాయి. ఈ ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కిన ‘అశకల్ ఆయిరం’ కుటుంబ సంబంధాల లోతును స్పష్టంగా చూపించే కథగా నిలుస్తోంది.
Most awaited Father – Son Duo Movie 🤩✨#AshakalAayiram (Malayalam)
Now streaming on Zee5 in Malayalam & Tamil🍿!!@kalidas700 #OTT_Trackers pic.twitter.com/QACdefpc3d— OTT Trackers (@OTT_Trackers) April 17, 2026
పూర్తి కథేంటంటే:
కేరళలోని ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన హరిహరన్ (జయరామ్) మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తుంటాడు. వాళ్ల కుటుంబానికి అతనే ఆధారం. కొడుకు అజీష్ హరిహరన్ (కాళిదాస్ జయరామ్) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగి, సినిమా హీరో అవ్వాలని కలలు కంటుంటాడు. అందుకోసం రీల్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాడు.
అవకాశాల కోసం ఆడిషన్లు ఇస్తుంటాడు. తనను తాను ‘యంగ్ ప్రిన్స్’ అని పిలుచుకుంటాడు. ఈ తండ్రీకొడుకుల ఆశలు, ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. అందుకే ఇద్దరి మధ్యా తరచూ అపార్థాలు వస్తుంటాయి. తల్లి ఆశా (ఆశా శరత్) వాళ్ల మధ్య గొడవలను తగ్గించడానికి ప్రయత్నిస్తుంటుంది.
►ALSO READ | రౌడీ స్టార్ మూవీ ముహూర్తానికి ‘నేచురల్ స్టార్’ క్లాప్.. నెట్టింట వైరల్ అవుతున్న విజయ్-నాని ఫోటోలు!
అయితే.. ఒక రోజు వాళ్ల ఏరియాలో ఓ సూపర్‌స్టార్ నటించే మలయాళం సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఆ షూటింగ్ వాళ్ల జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. అజీష్ తన కలలు సాకారం కావడానికి అవకాశం దొరుకుతుందని ఆశపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాలి.
ఎలా ఉందంటే:
జయరామ్ తన అనుభవంతో తండ్రి పాత్రలో ఎంతో సహజంగా నటించారు. కాళిదాస్ జయరామ్ యువత భావాలను ప్రతిబింబిస్తూ ఆకట్టుకున్నారు. తండ్రీకొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను ఇద్దరూ ఎంతో నిజాయితీగా చూపించారు. ఆశా శరత్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు.
దర్శకుడు జి. ప్రజిత్ కథను సరళంగా, సహజంగా చెప్పే ప్రయత్నం చేశారు. సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను బలపరుస్తాయి. సినిమాటోగ్రఫీ కేరళ అందాలను అందంగా చూపించింది.
మొత్తంగా: ‘అశకల్ ఆయిరం’ ఒక హృదయాన్ని తాకే ఫ్యామిలీ డ్రామా. తల్లిదండ్రులు-పిల్లల మధ్య ఉన్న భావోద్వేగాలను సున్నితంగా చూపిస్తుంది. ఎమోషనల్ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.